వేములవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆటో యూనియన్ ఎన్నికలు

ఈసారి యూనియన్ అధ్యక్ష పీఠం ఎవరికి.?కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు నేడు వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ లో సబ్ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

ఈ పోటీల్లో ముగ్గురు అభ్యర్థులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బత్తుల దేవరాజు, సయ్యద్ ఉమర్ లు పోటీ పడుతూ ఉండడంతో యూనియన్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఉత్కంఠ రేపుతుంది.

ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహించారు.మధ్యాహ్నం తర్వాత యూనియన్ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది అనేది తెలిసే అవకాశం ఉంది.అయితే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

Latest Rajanna Sircilla News