గుడుంబా స్థావరాలపై దాడులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో గుడుంబా స్థావరాలపై ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

మండలంలోని నిమ్మపల్లి, దేవునితండా, వట్టిమల్ల, బావుసాయిపేట, కమ్మరిపేట తాండాల్లో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 7 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు.నాటుసారాకు బాధ్యులైన ముగ్గురిపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ మిట్టపల్లి శ్రీనివాస్, డి టి ఎఫ్ ఎస్ ఐ శైలజ,సిరిసిల్ల ఎక్సైజ్ ఎస్ఐ ప్రణీత్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News