ఫారెస్ట్ అధికారులపై దాడి ఒకరికి గాయాలు

నల్లగొండ జిల్లా: దామరచర్ల మండలంలో కెజేఆర్ కాలనీ బీట్ పరిధిలో దిలావర్పూర్ ఆర్ఎఫ్ బ్లాక్ లో బాలాజీ నగర్ తండాకు చెందిన వాంకుడోత్ రమేష్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించి,శనివారం అందులో మొక్కలు నాటుతుండగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి,సెక్షన్ ఆఫీసర్ మల్లారెడ్డి, బీట్ ఆఫీసర్లు ముఖేష్,స్వామి, రవీందర్ రెడ్డి అక్కడికి చేరుకొని మొక్కలు నాటకుండా అడ్డుకున్నారు.

దీనితో రెచ్చిపోయిన ఆక్రమణదారులు ఫారెస్ట్ అధికారులపై దాడి చేయగా బీట్ ఆఫీసర్ ముఖేష్ కాలికి గాయాలయ్యాయి.

అతనిని ప్రథమ చికిత్స నిమిత్తం దామరచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి పోలీసులు తెలిపారు.

Attack On Forest Officials Leaves One Injured, Attack ,forest Officials ,one Inj
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News