వ్యక్తిపై గొడ్డలితో దాడి

సూర్యాపేట జిల్లా:ఓవ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి గాయపడిన ఘటన సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని కాసరబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కాసరబాద్ గ్రామానికి చెందిన కొమరశెట్టి శ్రవణ్ అదే గ్రామానికి చెందిన బంటు శీనుకు గతంలో డైరీ ఫామ్ నిర్వహిస్తుడగా కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు.

ఈ లావాదేవీల విషయంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి.ఈ క్రమంలో బంటు శీను బుధవారం సోషల్ మీడియాలో గతంలో మాట్లాడిన ఆడియో పోస్ట్ చేశాడు.

Assault On Person With Axe-వ్యక్తిపై గొడ్డలిత�

దీంతో కొమిరిశెట్టి శ్రవణ్ అతని దగ్గరకు వెళ్లి నాకు డబ్బులు ఇవ్వకపోగా సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నామని అడిగాడు.దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.

పదిమందిలో డబ్బులు అడుగుతావని కోపం పెంచుకున్న శీను అతని ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని శ్రవణ్ పై దాడి చేయగా తలకు రెండుచోట్ల గాయాలయ్యాయి.వెంటనే స్థానికులు క్షతగాత్రుని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకట్ రాములు తెలిపారు.

Advertisement

Latest Suryapet News