ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అప్రజాస్వామీకం

బహుజన ఉద్యమాన్ని అక్రమ అరెస్టులతో ఆపలేరని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు.

పేపర్ లీకేజీ తో అన్యాయానికి గురైన నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.

ఎస్.ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ ఎదురుగా బిఎస్పీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆరోపించారు.

Arrest Of RS Praveen Kumar Is Undemocratic , RS Praveen Kumar , Bahujan Samaj Pa

పేపర్ లీకేజీ స్కామ్ పై ప్రశ్నిస్తున్న డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు.బహుజన ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే అది మరింత రెట్టింపు అవుతుందన్నారు.

పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపి,స్కాంకు కారణమైన వ్యక్తులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు నుండి విడుదల చేయాలని,లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఉద్యమాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వ పాలనను గద్దె దింపాలని బహుజనులకు పిలుపునిచ్చారు.

Advertisement

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరి ఉపేందర్,జిల్లా ఉపాధ్యక్షులు పిడమర్తి దశరథ,జిల్లా కార్యదర్శి సాలె రామారావు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు చింతల రమేష్,ప్రధాన కార్యదర్శి కంభంపాటి శ్రావణ్ కుమార్,నియోజకవర్గ మహిళా కన్వీనర్లు అంథోటి జ్యోతి,వెంపటి నాగమణి,నాగమల్ల జ్యోతి,కలకొండ భరత్, మండల నాయకులు నేలమర్రి శ్యామ్,గొర్రె మంజుల,బోడా రమేష్, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

Latest Suryapet News