టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ఏపీ సర్కార్ కి హైకోర్టు షాక్..!!

ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది.ఇటీవల టీటీడీ జంబో పాలకమండలి నియామకాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు.

ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.ఈ క్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు పై హైకోర్టు స్టే విధించింది.

ఇటీవల ఏపీ ప్రభుత్వం తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..

ప్రత్యేక ఆహ్వానితులు నియమిస్తూ.జీవో జారీ చేయడం తెలిసిందే.

Advertisement

అయితే ఈ విషయం పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అదే  రీతిలో బీజేపీ ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఈ విషయంపై గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇదే సమయంలో టీటీడీ బోర్డు లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులనీ నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో 3 పిటిషన్ లు.దాఖలయ్యాయి.కాగా ఈ పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరగగా.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రత్యేక ఆహ్వానితులు వలన సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించగా., ప్రభుత్వం తరఫున న్యాయవాదులు నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు చేపట్టినట్లు కోర్టుకు విన్నవించుకున్నారు.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ ప్రత్యేక ఆహ్వానితులు నియామక జీవో ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 
Advertisement

తాజా వార్తలు