కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రతరం అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అవుతున్నాయి.కరోనా విస్తరించడానికి ఉన్న అన్ని అవకాశాలు మూసి వేస్తుంది.
మరో వైపు జిల్లాల వారీగా లాక్ డౌన్ అమలు చేయడానికి రెడీ అవుతుంది.ఏ జిల్లాలలో అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందో అక్కడ లాక్ డౌన్ ని కఠినంగా ఈ నెల 25 నుంచి అమలు చేయడానికి ఏపీ సర్కార్ సిద్ధమై ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చేసింది.
కేంద్ర ప్రభుత్వం పట్టించుకాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనాని కంట్రోల్ చేయడానికి మరింత జాగురాకతతో ఉంది.ఈ నేపధ్యంలోనే ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తీర్మానించింది.
తాజా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది.వారి చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు.పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులనుపై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.
చివరి సెమిస్టర్ పరీక్షల రద్దు నేపథ్యంలో విద్యార్థులకు గ్రేడింగ్, మార్కులపై నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనకి ముందు రోజు డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులకి సంబందించిన చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.