అవినాష్‌ రెడ్డి విచారణ మళ్లీ వాయిదా... వైకాపా శ్రేణుల్లో టెన్షన్‌ టెన్షన్‌

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య( YS Vivekananda Reddy ) కేసు లో భాస్కర్ రెడ్డి అరెస్టు నేపథ్యం లో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

నిన్న సాయంత్రం విచారించాలనుకున్న సిబిఐ నేటి విచారణకు రావలసిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది.

నేడు కూడా విచారించక రేపటికి వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు.రేపు ఉదయం ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ( Y.S.Avinash Reddy )సిబిఐ అధికారులు విచారించేందుకు నోటీసులు ఇచ్చారు.ఇంత ఆలస్యానికి కారణం కచ్చితంగా అరెస్టు చేసే ఉద్దేశం అంటూ చాలా మంది అభిప్రాయం చేస్తున్నారు.

ఈ నేపథ్యం లో అధికార పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

Ap Cm Ys Jagan Mohan Reddy Meeting With Ysrcp Leaders Due To Avinash Reddy Arres

ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అయి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి చర్చించడం జరిగింది.ఇక అధికార పార్టీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కచ్చితంగా పార్టీకి పెద్ద డ్యామేజ్ అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

Ap Cm Ys Jagan Mohan Reddy Meeting With Ysrcp Leaders Due To Avinash Reddy Arres
Advertisement
Ap Cm Ys Jagan Mohan Reddy Meeting With Ysrcp Leaders Due To Avinash Reddy Arres

అందుకే ఎట్టి పరిస్థితుల్లో వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ఢిల్లీ స్థాయిలో వైకాపా నాయకులు లాబీయింగ్‌ జరుపుతున్నారని.ప్రధాని నరేంద్ర మోడీ నుండి మొదలుకొని పలు ముఖ్య జాతీయ నాయకులతో మాట్లాడుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

సిబిఐ అధికారులు మాత్రం వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందే అన్నట్లుగా దూకుడు మీద ఉన్నారు.

Ap Cm Ys Jagan Mohan Reddy Meeting With Ysrcp Leaders Due To Avinash Reddy Arres

మరి కేంద్రం నుండి ఏమైనా లీడ్ వచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పించుకుంటాడా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.బెయిల్‌ కోసం పిటిషన్ వేసిన అవినాష్ రెడ్డి.బెయిల్ పొందుతాడా లేదా అనే విషయం లో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు