జనాల మీద కోపమేంటి జగన్ ?

ఏపీలో తిరుగులేని అధికారాన్ని జగన్ దక్కించుకోగలిగారు అంటే,  అది ఖచ్చితంగా జన బలమే కారణం .151 సీట్లలో వైసిపి అభ్యర్థులను గెలిపించి జనాలు జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు .

2019 ఎన్నికలకు ముందు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు.అప్పటి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ నిరంతరం ఏదో ఒక ప్రజా సమస్యలపై స్పందిస్తూ,  జనంలోనే ఉంటూ జగన్ పోరాటాలు చేసేవారు.

దీంతో జగన్ కు ఈ స్థాయిలో క్రేజ్ వచ్చింది.అయితే 2019 ఎన్నికల్లో అధికారం దక్కిన దగ్గర నుంచి జగన్ పంథా మారిపోయింది.పూర్తిగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పరిమితం అయిపోతున్నారు.

  అత్యవసరం అయితే తప్ప బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే పథకాలను జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచే ప్రారంభిస్తున్నారు తప్ప,  జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు.

అలాగే రాష్ట్రంలో ఎన్నో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నా,  అత్యవసరం అయితే తప్ప జగన్ స్వయంగా హాజరయ్యేందుకు ఇష్టపడడం లేదు.పూర్తిగా జనాలకు జగన్ దర్శనం లభించడం లేదు.జనాలకే కాదు , సొంత పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ దర్శనం దొరకడం కష్టం అవుతోంది.

Advertisement

దీంతో గత కొంతకాలంగా జగన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గెలిచే అంత వరకు జనాల్లో ఉండి,  గెలిచిన తర్వాత జనాలకు జగన్ కనిపించడం లేదని,  తాను కనిపించకపోయినా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించే విధంగా వ్యవహరిస్తున్నా, వైసీపీకి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్టు గా కనిపించడం లేదు.ఎన్నికలకు ముందు తాను జనాల్లోకి వస్తే సరిపోతుంది అని,  అప్పటి వరకు తాను ఇదేవిధంగా వ్యవహరిస్తాను  అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ని భారీ ఎత్తున నిర్వహించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు .పార్టీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాల పైన సమగ్రంగా చర్చించనున్నారు.అలాగే పార్టీలోనూ భారీ ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తుండడంతో, జగన్ వ్యవహారంపై జనాల్లో ఉన్న అభిప్రాయం ఏమిటనేది ఈ సర్వేలో తేలిపోనుంది ఈ నివేదిక ఆధారంగా జగన్ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.

పవన్ కు కేంద్ర మంత్రి పదవి ?  నాగబాబుకు అందుకేనా ఛాన్స్ ? 
Advertisement

తాజా వార్తలు