న్యూస్ రౌండప్ టాప్ 20

1.కొత్త మెడికల్ కాలేజీలకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్త వైద్య విద్య కళాశాలలో ఏర్పాటుకు దరఖాస్తుల కోరుతూ జాతీయ వైద్య మండలి సోమవారం ప్రకటన చేసింది.

కొత్త మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు జులై 21 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. 

2.డయల్ 100 కి ఉబెర్ అనుసంధానం

 

మహిళల సురక్షిత ప్రయాణం కోసం తెలంగాణ పోలీస్ శాఖ డయిల్ 100 తో ఊబెర్ యాప్ తో ఉబెర్ యాప్ ను అనుసంధానం చేసింది. 

3.కాలేశ్వరాన్ని షెడ్యూల్ 2 నుంచి తీసేయండి

  తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులను నిర్వహణను గోదావరి నది బోర్డుకు అప్పగించాలంటూ కేంద్ర జల శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ ను సవరించాలని రాష్ట్రప్రభుత్వం కోరింది.ఈ మేరకు తెలంగాణ ఈ ఎన్ సి మురళీధర్ గోదావరి బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు. 

4.ఆగస్టు లో కృష్ణ ట్రిబ్యునల్ విచారణ

 

కృష్ణ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ పై ఆగస్టు 24, 25 ,26 తేదీల్లో జస్టిస్ బ్రిజిష్ కుమార్ కృష్ణ ట్రిబ్యునల్ విచారణ జరపనుంది. 

5.21న కాంగ్రెస్ భారీ ర్యాలీ , ఈడి ఆఫీసు వద్ద ధర్నా

 సోనియా రాహుల్ గాంధీ లపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఈనెల 21న ఈ డి ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 

6.కెసిఆర్ పై ఈటెల రాజేందర్ విమర్శలు

 

సీఎం కేసీఆర్ ఇంజనీర్లు నిపుణుల మాటలు పక్కనపెట్టి అంతా తానే అన్నట్లుగా అహంకార పూరితంగా వ్యవహరించడం వల్లే కాలేశ్వరం ప్రాజెక్ట్ పంప్ హౌస్ లు నీట మునిగాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. 

7.తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

  వరదల వల్ల సంభవించిన నష్టాలపై ప్రాథమిక నివేదికలు అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

8 పోలవరం తో భద్రాచలం కి ముప్పు

 

Advertisement

ఏపీ నిర్మించిన పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం కి ముప్పు ఏర్పడిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 

9.ఋషి కొండపై విచారణ 27కు వాయిదా

  ఋషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.తదుపరి విచారణ ఈనెల 27 కి వాయిదా వేశారు. 

10.తుంగభద్ర కు పెరుగుతున్న వరద

 

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.ఇప్పటికే ప్రాజెక్టుగా 31 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

11.ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష షెడ్యూల్ ఖరారు

  తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కారణంగా వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్ ప్రైవేట్ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత ఉద్యమ మండలి ఖరారు చేసింది.ఈ నెల 30 31న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. 

12.ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ దాఖలకు నేడు ఆఖరి రోజు

 

ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ దాఖలకు నేడు ఆఖరి రోజు ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ దన్ ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. 

13.ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో గౌతం ఆదాని

  ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు గౌతం ఆదాని నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. 

14.ఏపీలో నేడు స్కూల్స్ బంద్

 

 కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని నిరసిస్తూ ఏబీవీపీ ఈరోజు పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. 

15.యానంలో నేడు తెలంగాణ గవర్నర్ పర్యటన

  అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలో నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పర్యటించనున్నారు. 

16.ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

 

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కానుంది.శ్రీలంక సంక్షోభం,  తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. 

17.విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్

  విపక్షాల ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆళ్వా నేడు నామినేషన్ వేయనున్నారు. 

18.సంక్షేమ పథకాలకు నిధుల విడుదల

 

Advertisement

ఏపీలో సంక్షేమ పథకాలకు నేడు 137 కోట్లు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. 

19.జగన్ పై చంద్రబాబు కామెంట్స్

  ఏపీ సీఎం జగన్ ప్రోత్సాహంతోనే హత్య రాజకీయాలు జరుగుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,300   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,510.

తాజా వార్తలు