న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైద్య విద్యార్థులకు గమనిక

ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ ( నర్సింగ్ ) కోర్సుl 2023 24 విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కోట సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

2.తెలంగాణలో రైతు సభలు

తెలంగాణలో నేటి నుంచి పది రోజులు పాటు రైతు సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

3.తిరుమల సమాచారం

జూలై 18న శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.

4.పిఆర్సీ అవసరం లేదు : ఎన్టీఏ

సాంకేతికతను ఉపయోగించుకుని ఒక నెలలోనే కొత్త వేతనాలు అమలు చేయవచ్చని , దీనికోసం పి ఆర్ సి అవసరం లేదని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది.

5.తిరుపతి చేరుకున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు.శ్రీకాళహస్తి సిఐపై ఆయన ఎస్పీ కి  ఫిర్యాదు చేయమన్నారు.

6.ప్రజలకు చంద్రబాబు సూచన

ఓటర్ల జాబితా సవరణ పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు.

7.బంగాళాఖాతంలో అల్పపీడనం

Advertisement

పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, ఒడిశా, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో అల్పపీడనం ఏర్పడినట్లు గోపాలపూర్ వాతావరణం అధ్యయన కేంద్రం ఐఎండి అధికారులు తెలిపారు.

8.డీజీపీ కి చంద్రబాబు లేఖ

కాకినాడకు చెందిన ఆరుద్ర కు వెంటనే రక్షణ కల్పించాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

9.రేవంత్ రెడ్డి కి వృద్ధురాలు హెచ్చరిక

మూడు గంటలే విద్యుత్ ఇస్తామంటే ఈ కర్రతో కొడతా బిడ్డ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని హెచ్చరించింది.మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ఓబులాయలపల్లిలో నిర్వహించిన రైతు సభలో ఈ ఘటన జరిగింది.

10.కేదార్నాథ్ లో ఫోటోలు తీయడం నిషేధం

పుణ్యక్షేత్రం కేదార్నాథ్ లో ఫోటోలు తీయడం నిషేధమని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.

11.బెంగళూరులో విపక్షాల భేటీ

కాంగ్రెస్ టీఎంసీ ఆఫ్ సహా బిజెపి నివేదించి పార్టీలతో కూడిన నూతన కూటమి పేరు ఇక యునైటెడ్ ప్రోగ్రెస్ గా కొనసాగే అవకాశం కనిపించడం లేదు.బెంగళూరులో రేపు 20 పార్టీలకు పైగా పాల్గొని విపక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.

12.  యధాద్రిశ్వరుడిని దర్శించుకున్న కెనడా మంత్రి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ దర్శించుకున్నారు.

13.వందే భారత్ రైల్లో మంటలు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీ బయలుదేరిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.ఓ కోచ్ లో మంటలు చెలరేగాయి.

14.రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శలు

గాంధీ భవన్ లో గాడ్సే.ఎమ్మెల్యేలను కొనడంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిట్ట అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

15.రేవంత్ క్షమాపణలు చెప్పాలి

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ రంగారావుపై చేసిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని న్యాయవాదులు  ఆందోళన చేపట్టారు.

15.తెలంగాణలో 24% లోటు వర్షం

తెలంగాణలో 24% లోటు వర్షపాతం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

16.స్నాతకోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్

అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.

17.పురందరేశ్వరి విమర్శలు

Advertisement

ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నడుస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరిశ్వరి విమర్శించారు.

18.హైదరాబాద్ కు ఏఐసీసీ ఇంచార్జ్

జిల్లాల కాంగ్రెస్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ఈరోజు హైదరాబాద్ కు ఏఐసిసి ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే వచ్చారు.19.కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

కెసిఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

20.సెప్టెంబర్ లో టెట్

సెప్టెంబర్లు టెట్ నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

తాజా వార్తలు