న్యూస్ రౌండప్ టాప్ 20 

1.ఏపీ జెఎసి నిరసన దీక్షలు

ఏపీ వ్యాప్తంగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు చేపట్టింది.

విజయవాడ సెంటర్ లో ఆందోళనకు దిగింది.

2.కేంద్రానికి కేటీఆర్ లేఖ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను తెలుగులోనూ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారు.

3.ప్రధాని పర్యటనకు కేసిఆర్ దూరం

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో , టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు.

4.ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ బదిలీ జరిగింది.39 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

5.  తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి 30 గంటలు సమయం పట్టనున్నట్టు టిటిడి అధికారులు తెలిపారు.

6.హరీష్ రావుకు జర్నలిస్టుల వినతి

జర్నలిస్టులు , వారి కుటుంబాలకు మాస్టర్ హెల్త్ చెకప్ చేయాలని మంత్రి హరీష్ రావు టీ డబ్ల్యూ జేఎఫ్ వినతి పత్రం అందించింది.

7.సిపిఎం సిపిఐ నిరసన లు

Advertisement

తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ను నిరసిస్తూ,  సిపిఎం, సిపిఐ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేశాయి.

8.మానవ హక్కుల సంఘం చైర్మన్ కు డాక్టరేట్

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ కు మేజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవ డాక్టరేట్ తో పాటు ఆయన ను సత్కరించందని ఆ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు తెలిపారు.

9.టిడిపి అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.

10.కెసిఆర్ కిషన్ రెడ్డి ఆగ్రహం

అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తుంటే నిరసనలకు పిలుపునిస్తారా అంటూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

11.వాట్సప్ లో తెలుగు పేపర్ పై దర్యాప్తు ముమ్మరం

వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రాన్ని వాట్సప్ లో షేర్ చేసిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

12.ఎన్టీఆర్ ప్రసంగాల సంకలన పుస్తకావిష్కరణకు ఏర్పాటు

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు సందర్భంగా ఆయన సంకలన పుస్తకావిష్కరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి జాతీయ కమిటీ పొలిటికల్ కార్యదర్శి టిడి జనార్ధన్ తెలిపారు.

13.జెన్కో ఎండి గా చక్రధర బాబు

ఏపీ జెన్కో ఎండిగా కేవీఎన్ చక్రధర బాబు బాధ్యతలు స్వీకరించారు.

14.బండి సంజయ్ పై ఎర్రబెల్లి విమర్శలు

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో రిమాండ్ లో ఉన్న బండి సంజయ్ కు బెయిల్ వస్తే సంబరాలు జరుపుతారా.బెయిల్ వస్తే తప్పు చేయనట్లా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

15.సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

Advertisement

సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈ రోజు ప్రధాన నరేంద్ర మోది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు.

16.కడపలో అఖిలపక్ష నేతల అరెస్టులు

కడప జిల్లా కేంద్రంలో తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.పశుసంవర్ధక శాఖ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు ర్యాలీ తలపెట్ట పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

17.టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం

తెలంగాణలో ఎస్ఎస్సి పరీక్షలు ఏప్రిల్ 11 తో ముగియనున్నాయి.అనంతరం ఏప్రిల్ 13 నుంచి పరీక్ష పేపర్లో మూల్యాంకనం ప్రారంభమవుతుంది.

18.ఐ ఎన్ ఎస్ తార్ముగలి కి వీడ్కోలు

తూర్పున ఒకదానికి చెందిన తీర ప్రాంతం గస్తీ నౌక ఐ ఎన్ ఎస్ తార్ముగలికి ఘనంగా వీడ్కోలు పలికారు.

19.చంద్రబాబు కు జోగి సవాల్

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ టిడిపి అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు.చంద్రబాబు ట్విట్ కు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం,  రాష్ట్రంలోని ఒక కోటి 50 లక్షలు రావడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు.

20.మత్స్యకార ముఖ్య నాయకుల సమావేశం

నేడు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల మత్యకార ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఏపీ లోని మత్యకారుల సంక్షేమ ,అభివృద్ధి జీవన విధానం పై చర్చ జరిగింది.

తాజా వార్తలు