Anasuya Jabardasth: అనసూయ జబర్దస్త్ ని వదిలేసి తప్పు చేసిందా.. సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదుగా?

జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ నటిగా తన సత్తాను చాటుతోంది.

 Anasuya Made A Hasty Mistake Regards Jabardasth Now She Lose Both Details, Anasu-TeluguStop.com

జబర్దస్త్ స్టేజ్ ద్వారా భారీ క్రేజ్ ను సంపాదించుకుంది అనసూయ.ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాలలో ప్రధాన పాత్రలో నటిస్తూ దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.యూత్ లో అనసూయకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ చేస్తూ కుర్ర కారుకు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.అంతే కాకుండా తెలుగు బుల్లితెరపై ఉన్న అందాల హాట్ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు.

కాగా ఇప్పటికే అనసూయ వెండితెరపై రంగమ్మత్త, దాక్షాయిని లాంటి మంచి మంచి క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం నటిగా బిజీబిజీగా మారిపోయింది అనసూయ.

ఈమెకు వెండితెరపై అవకాశాలు ఎక్కువ కావడంతో జబర్దస్త్ స్టేజ్ కి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే.జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె ఆ షోపై కామెంట్స్ చేస్తూ తన మనసును చంపుకుని చేయాల్సి వస్తుందని బాడీ షేవింగ్ కామెంట్లను భరించాల్సి వస్తుంది అని ఆరోపించింది.

Telugu Anasuya, Anchor Anasuya, Jabardasth, Mallemala, Chance, Rashmi-Movie

అంతేకాకుండా ఆమె రెమ్యూనరేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఆ కారణంగానే జబర్దస్త్ ను వదిలేసింది అంటూ కూడా వార్తలు వినిపించాయి.ఇది ఇలా ఉంటే అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్థానంలో రష్మి యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు అనసూయ స్థానంలో మరొక కొత్త యాంకర్ వచ్చింది.

కన్నడ నటి యాంకర్ సౌమ్య రావుని తీసుకువచ్చింది మల్లెమాల టీమ్.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఏమిటంటే అనసూయ జబర్దస్త్ లాంటి ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Anasuya, Anchor Anasuya, Jabardasth, Mallemala, Chance, Rashmi-Movie

అనసూయ చేసిన ఒక పొరపాటు వల్ల ఆమె చాలా మిస్ అవుతుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ స్టేజ్ ద్వారా మంచి పాపులారిటీ, క్రేజ్ ని సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు మళ్లీ ఆ క్రేజ్ ని పాపులారీటిని మిస్ చేసుకుంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.బుల్లితెరపై అవకాశాలు అనసూయకి క్రమంగా తగ్గిపోవడంతో ఆమె జబర్దస్త్ వదిలేయడమే ప్రధాన కారణం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube