జూనియర్ రౌడీ జోరు మామూలుగా లేదుగా..!

సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలా కామన్‌.హీరోలు నుండి కమెడియన్స్ వరకు ఎంతో మంది తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు.

విజయ్‌ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ ను దొరసాని సినిమాతో పరిచయం చేశాడు.అమెరికాలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేసుకునే ఆనంద్‌ దేవరకొండ వచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

మొదటి సినిమా దొరసాని నిరాశ పర్చిన సమయంలో ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.కాని ఆయన జోరు మామూలుగా లేదు.

ఇప్పటికే రెండవ సినిమా మిడిల్‌ క్లాస్ మెలోడీస్ అనే సినిమాను చేశాడు.ఆ సినిమా విమర్శకుల ప్రశంలసు దక్కించుకుంది.

Advertisement
Anand Devarakonda Fourth Film Highway Movie Shooting Starts , Anand Devarakonda

ఆనంద్‌ కు నటుడిగా కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.ఆ సినిమా ను సైలెంట్ గా మొదలు పెట్టిన ఆనంద్‌ అంతే సైలెంట్‌ గా విడుదల తేదీ అనౌన్స్‌ చేశాడు.

ఇక పుష్పక విమానం సినిమా విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ అదే జోరు ప్రదర్శించాడు.పుష్పక విమానం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

ఇప్పటికే మిడిల్ క్లాస్ మెలోడీస్ ను ఓటీటీ ద్వారా విడుదల చేశామనే ఉద్దేశ్యంతో కనీసం మూడవ సినిమా పుష్పక విమానం అయినా థియేటర్‌ ద్వారా విడుదల చేయాలని ఆనంద్‌ ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది.అందుకే పుష్పక విమానం ను పూర్తి చేసి అలా పక్కకు పెట్టాడు.

Anand Devarakonda Fourth Film Highway Movie Shooting Starts , Anand Devarakonda

విజయ్ దేవరకొండ గత రెండేళ్లుగా ఒక్క సినిమాను కూడా చేయలేదు.కాని ఆనంద్‌ దేవరకొండ మాత్రం మూడవ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు.ఇప్పటికే ఒకటి విడుదల అయ్యింది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

మరోటి షూటింగ్‌ పూర్తి అయ్యింది.నాల్గవ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

  నాల్గవ సినిమాకు హైవే అనే టైటిల్ ను ఖరారు చేశారు.మొత్తానికి అన్నలా స్లో గా కాకుండా ఆనంద్‌ స్పీడ్‌ గా సినిమాలు చేయడం అభినందనీయం.

తాజా వార్తలు