84 ఏళ్ల వయసులో సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చిన వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే...

సాధారణంగా 80 ఏళ్ల వయసు దాటితే చాలామంది మంచానికే పరిమితం అవుతారు.వారి జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

 An Old Man Who Changed His Bicycle To An Electric Bicycle At The Age Of 84 If Yo-TeluguStop.com

ఎనర్జీ లెవెల్స్ బాగా పడిపోతాయి.ఏ పనీ చేయడం చేతకాదు.

కానీ ఒక 84 ఏళ్ల తాత మాత్రం గొప్ప ఆలోచనలతో తన సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.వివరాల్లోకి వెళ్తే, జమ్ము కశ్మీర్‌కు చెందిన మున్షీ రామ్( Munshi Ram ) అనే 84 ఏళ్ల వృద్ధుడు ఓల్డ్ ల్యాప్‌టాప్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉపయోగించి సౌర, విద్యుత్ శక్తితో నడిచే ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేశాడు.“వోకల్ ఫర్ లోకల్”, “గ్రీన్ ఇండియా” ( “Vocal for Local”, “Green India” )కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులతో అతను ప్రేరణ పొంది ఈ ఆవిష్కరణ చేశాడు.ఉదంపూర్ ప్రజలు అతని ఇంటి వెలుపల గుమిగూడి అతని ఆవిష్కరణను ప్రశంసించారు.

Telugu Discarded, Munshi Ram, Solar Energy-Latest News - Telugu

ఈ ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ సైకిల్ సౌరశక్తి, విద్యుత్తును ఉపయోగించి ఛార్జ్ అవుతుంది.రామ్ తన ఈ-బైక్‌లో అవసరమైన సౌర శక్తిని ఉత్పత్తి చేయడానికి తన ఇంటి పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్‌ను అమర్చాడు.పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తన మూములు సైకిల్ ను నడపడానికి ఎప్పుడూ ఇష్టపడే వాడినని, కానీ 31 కి.మీ దూరంలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లలేకపోయానని, అందుకే సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.పెట్రోల్ స్కూటర్ కొనగలిగే సామర్థ్యం ఉన్నా, మోదీ చెప్పిన మాటలు తనను ఎలక్ట్రిక్ సైకిల్ ( Electric bicycle )వైపే మళ్ళించాయని అతను వివరించాడు.

Telugu Discarded, Munshi Ram, Solar Energy-Latest News - Telugu

ఆవశ్యకత అనేది ఆవిష్కరణకు నాంది పలుకుతుందని అని రామ్ నమ్మాడు.అతను పక్కన పడేసిన ల్యాప్‌టాప్ బ్యాటరీలను తిరిగి ఉపయోగించమని ఇతరులను ప్రోత్సహిస్తాడు.రామ్ మున్షీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మనసుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నాడు.ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పారవేసే బదులు తిరిగి వినియోగించడం యొక్క ప్రాముఖ్యతను కూడా మున్షీ ఎత్తిచూపాడు.

ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెద్ద పర్యావరణ సమస్య కాబట్టి ఇది మనమందరం వినవలసిన సందేశం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube