ఒక చేతిలో గొడ్డలి.. మరో చేతిలో రోకలి.. ఇలాంటి హనుమంతుడి దేవాలయం ఎక్కడుందంటే..!

మన భారత దేశంలో ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలు( Ancient shrines ) ఉన్నాయి.దాదాపు ప్రతి ఊరిలోనూ ఆంజనేయస్వామి దేవాలయం( Anjaneyaswamy Temple ) ఉంది.

ఇందులో ఎన్నో విభిన్నమైన దేవాలయాలు కనిపిస్తాయి.రాజస్థాన్ లోని కరౌలి జిల్లాలో ( Karauli district , Rajasthan )ఒక ప్రత్యేకమైన హనుమాన్ మందిరం ఉంది.

ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం మిగతా వాటితో పోల్చితే విభిన్నంగా ఉంటుంది.ఈ దేవాలయంలో హనుమంతుడి చేతిలో రెండు ఆయుధాలు ఉంటాయి.

అందులో ఒకటి రోకలి లాంటి కర్ర అయితే మరొకటి గొడ్డలి దేశంలో ఇంకెక్కడ ఇలాంటి విగ్రహం ఉండకపోవచ్చు.

An Ax In One Hand A Pestle In The Other Hand Where Is A Hanuman Temple Like This
Advertisement
An Ax In One Hand A Pestle In The Other Hand Where Is A Hanuman Temple Like This

కరౌలి జిల్లా చారిత్రక నేపథ్యమున్న బహదూర్‌పూర్ గ్రామం( Bahadurpur village )లో ఈ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది.నది ఒడ్డున ఉన్న దేవాలయం ముందు ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంటుంది.ఇక్కడ హనుమంతుడిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు.

ఈ దేవాలయానికి స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా తరలివస్తూ ఉంటారు.బహదూర్‌పూర్ గ్రామం స్థాపనకు ముందు నుంచే హనుమాన్ విగ్రహం ఇక్కడ ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఆ విగ్రహం నదిలో కొట్టుకొచ్చిందని చాలా సంవత్సరాల క్రితం ఉపాధ్యాయ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు నది నుంచి బయటకు తీసి నది ఒడ్డున స్థాపించారని కూడా స్థానికులు చెబుతున్నారు.

An Ax In One Hand A Pestle In The Other Hand Where Is A Hanuman Temple Like This

ఈ దేవాలయంలో హనుమంతుడితో పాటు అక్కడ ఉన్న రావి చెట్టును కూడా భక్తిశ్రద్ధలతో ప్రజలు పూజిస్తున్నారు.సంతానం లేని భార్యాభర్తలు కుమార్తె ఉండి కుమారుడు లేని తల్లిదండ్రులు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారని పూజారులు చెబుతున్నారు.హనుమంతుడి ఆశీర్వాదాలతో ఎంతోమంది కుమారుడు పొందారని కూడా స్థానికులు చెబుతున్నారు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ముఖ్యంగా కొడుకు పుట్టాలని కోరుకునేవారు దేవాలయంలో రావి చెట్టు ముందు హనుమాన్ విగ్రహానికి ఎదురుగా నిలబడి కోరికలు కోరితే అవి నెరవేరుతాయి అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు