స్ట్రాబెర్రీ-బ‌నానాల‌ను క‌లిపి ఇలా తీసుకుంటే వండర్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్ మీసొంతం!

స్ట్రాబెర్రీ-బ‌నానా.ఈ రెండు రుచిక‌ర‌మైన‌ పండ్లే కాదు ఆరోగ్య‌క‌ర‌మైనవి కూడా.

స్ట్రాబెర్రీ మరియు అర‌టి పండ‌ల్లో విట‌మిన్ సి, విట‌మిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, మాంగనీస్, ప్రోటీన్‌, ఫైబ‌ర్ తో స‌హా శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా ఇవి అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

అయితే స్ట్రాబెర్రీ-బ‌నానాల‌ను విడి విడిగా కాకుండా క‌లిపి ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే మ‌రిన్ని వండ‌ల్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం స్ట్రాబెర్రీ-బ‌నానాల‌ను క‌లిపి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక అర‌టి పండు, ఒక స్ట్రాబెర్రీ పండు తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్క‌లు, అర‌టి పండు ముక్క‌లు, ఒక‌టిన్న‌ర గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత ఇందులో అర స్పూన్ అవిసె గింజ‌ల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ బాదం ప‌లుకులు, స‌న్న‌గా త‌రిగిన స్ట్రాబెర్రీ మ‌రియు బ‌నానా ముక్క‌ల‌ను వేసి క‌లిపితే.స్ట్రాబెర్రీ-బ‌నానా స్మూతీ త‌యారు అవుతుంది.

ఈ సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే.మెమరీ పవర్ పెరుగుతుంది.హార్ట్ స్ట్రోక్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.

పొట్టలో అల్సర్ ఉంటే.దాని నుంచి విముక్తి ల‌భిస్తుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

నీరసం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం మెరుగుప‌డుతుంది.

Advertisement

తాజా వార్తలు