'SSMB28' పై థమన్ ఆసక్తికరమైన పోస్ట్.. కొత్త రికార్డులు సృష్టిస్తుందంటూ..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

 Thaman Interesting Post On Mahesh Ssmb28-TeluguStop.com

ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.అయితే ప్రెసెంట్ మహేష్ బాబు యూరప్ లో ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక్కడి నుండి వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.దీంతో ఇప్పుడు చేసే సినిమా గ్యాప్ లేకుండా చేయాలని అనుకున్నాడు.

జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.ఇక తాజాగా ఈ సినిమా గురించిన అప్డేట్ ఒకరి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించాడు.SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కాకుండానే ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా మ్యూజికల్ సిట్టింగ్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Telugu Mahesh Babu, Music Thaman, Sarkaruvaari, Ssmbmahesh, Ssmb, Thaman, Trivik

ఈ క్రమంలోనే థమన్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించిన అప్డేట్ ఒకటి ఇచ్చాడు.థమన్, త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తమ కొత్త జర్నీ సరికొత్త రికార్డ్స్ ను మొదలు పెట్టింది అంటూ చెప్పడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.మహేష్ లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్పీడ్ గా జరుగుతుంది అని ఈ పోస్ట్ తోనే అర్ధం అవుతుంది.

మరి రెగ్యురల్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Telugu Mahesh Babu, Music Thaman, Sarkaruvaari, Ssmbmahesh, Ssmb, Thaman, Trivik

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను వచ్చే సంక్రాంతిని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube