ఢిల్లీ చేరిన అమరావతి రైతులు

ఏపీ రాజధాని అమరావతి కోసం వేల ఎకరాలు ఇచ్చిన తమకు జగన్‌ ప్రభుత్వం అన్యాయం చేయబోతుందని, వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతుందని అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.

గత రెండు నెలలుగా అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా వారు ఢిల్లీ వెళ్లి మరీ ఆందోళనలు చేస్తున్నారు.ఒక వైపు ఢిల్లీ ప్రముఖులను కలవడంతో పాటు మరో వైపు తమ గోడును జాతీయ మీడియాలో వినిపించేందుకు సిద్దం అయ్యారు.

Amaravathi Farmars Reached In Delhi About Ap Three Capitals-ఢిల్లీ

మొదటగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి అమరావతి రైతులు తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.వేల ఎకరాలు ఇచ్చిన మేము ఇప్పుడు ఏం చేయాలని, మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

అమరావతి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అంతా కూడా జగన్‌ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోతారంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు సహా సోనియా గాంధీ ఇంకా కేంద్ర నాయకులను కూడా అమరావతి రైతులు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు