అల్లు అర్జున్, అక్షయ్ కుమార్ సినిమా.. అన్ని కుదురుతాయా?

చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన విషయం తెలిసిందే.అలాగే ఈ సినిమాలో సంజయ్ దత్, సోను సూద్ లు కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా నేడు అనగా జూన్ 3 న రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.

సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు సీరియస్గా సమాధానం ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే.

Advertisement
Akshay Kumar Wants To Do A Film With Allu Arjun And South Heroes Akshay Kumar, A

ఇంటర్వ్యూ లో భాగంగా సదరు యాంకర్ మాట్లాడుతూ నార్త్ హీరోలను సౌత్ సినిమాలు, హీరోలు డామినేట్ చేయడం గురించి అడగగా వెంటనే స్పందించిన అక్షయ్ కుమార్.ముందుగా నార్త్ హీరోలు సౌత్ హీరోలు అని మాట్లాడకండి.

ఎంతకాలం అని ఇలా చెబుతారు.నార్త్ సౌత్ అనేది ఇప్పటికీ పాత విషయం అయిపోయింది అంటూ కాస్త ఘాటుగా స్పందించారు అక్షయ్ కుమార్.

మీరు ఇప్పటికీ విభజించి పాలించు అన్న విధానాన్ని ఫాలో అవుతున్నారు.

Akshay Kumar Wants To Do A Film With Allu Arjun And South Heroes Akshay Kumar, A

అలాంటి మాటలతో దయచేసి దేశాన్ని విడదీయడం ఆపండి.ఇంకా ఆ రకమైన దృశ్యాన్ని క్రియేట్ చేయకండి సౌత్ నార్త్ అనేది ఏమీ లేదు ఇది ఇండియన్ ఇండస్ట్రీ అందరు హీరోలు కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమయింది.అంతేకాకుండా అన్ని కుదిరితే నేను అల్లు అర్జున్ కలిసి పనిచేస్తాం మరో సౌత్ హీరో నాతో కలిసి పనిచేస్తారు ఇదే ఇకపై మనం ఇదే మాట్లాడాల్సింది అంటూ రిప్లై ఇచ్చాడు అక్షయ్ కుమార్.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇంటర్వ్యూ లో భాగంగా అక్షయ్ కుమార్ స్పందించిన తీరు,చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు