రేడుచర్ల పి.హెచ్.సిలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల( Nereducharla ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.

లత( Additional Collector BS Latha ) ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రోగులకు వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.ల్యాబ్, ఫార్మసీ,రిజిస్టర్లు,ఆసుపత్రి ఆవరణం తిరిగి పరిశీలించారు.

Additional Collector Spot Checks At Nereducharla PHC, Nereducharla , Additiona

ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరం( Dengue fever )తో వచ్చిన కేసుల వివరాలను తెలుసుకున్నారు.అనంతరం పి.హెచ్.సి డాక్టర్ నాగినిని ఆసుపత్రిలో సమస్యలు అడగగా స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉన్నందున డెలివరీల సమయంలో ఇబ్బందిగా ఉందని,గతంలో కలెక్టర్, మంత్రికి వినతిపత్రం అందించామని తెలిపారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్టాఫ్ నర్స్ ను వెంటనే నియమించే ప్రయత్నం చేస్తానని,సీజనల్ వ్యాధులు, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రోగులకు సరైన వైద్యం అందించాలని,వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Advertisement

ఆసుపత్రి స్టాఫ్ అంతా సమయపాలన పాటించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ అధికారులు,మున్సిపల్ అధికారులు,ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News