వృద్ధుల సంక్షేమానికి కృషి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల :వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.వయో వృద్ధుల వారోత్సవాల సందర్భంగా స్త్రీ శిశు వయోవృద్ధుల దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియం లో కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని వయో వృద్ధుల ఆశ్రమాల్లో చెస్, క్యారం, లూడో ఆటల పరికరాలు, డీటీహెచ్ అందుబాటులో ఉంచామని, వారిని తీర్థ యాత్రలు, విహార యాత్రలకు, సినిమాలకు తీసుకెళ్తున్నమని వివరించారు.జిల్లాలోని రెండు ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ ఆశ్రమాల్లో మొత్తం మంది ఉన్నారని వెల్లడించారు.

తమ పేరిట ఉన్న ఆస్తి, ఇతరాలు మొత్తం పిల్లలకు ఇవ్వకూడదని, తమ కూడా పెట్టుకోవాలని సూచించారు.వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది టోల్ ఫ్రీ నెంబర్లను సద్వినియం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారులను, పోలీసు వారిని, వైద్యాధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు."తల్లి దండ్రుల మరియు వయో వృద్దుల పోషణ సంక్షేమ చట్టం, 2007" ప్రభుత్వం తీసుకువచ్చిందని, 14567 అనే టోల్ ఫ్రీ నెంబరును ప్రవేశపెట్టిందని వివరించారు.

ఉదయం 8 గంటలనుండి  సాయంత్రం 8 గంటల వరకు తెలిపారు.అనంతరం పలువురు వృద్ధుల ఆశ్రమాల బాధ్యులను సన్మానించారు.

ఇక్కడ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రాజం, ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి వసంత రావు, ఆయాశాఖల అధికారులు, పలు ఆశ్రమాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం గ్రూప్ -2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
Advertisement

Latest Rajanna Sircilla News