ఐపీఎల్ బయోబబుల్ నుంచి మరో ఇద్దరు ప్లేయర్లు ఔట్..!

కరోనాను ఎదురించి బయోబబుల్ సెక్యూర్ వాతావరణంలో ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతోంది.

అయితే, ఈ వైరప్ వ్యాప్తి ఎఫెక్ట్ తో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

వైరస్ భయంతో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్ కు దూరం అవుతున్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఆఫ్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుటికే టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

కరోనా బారిన పడిన తన కుటుంబసభ్యులకు అండగా ఉండేందుకు అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.దీంతో ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆండ్రూ టై కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాడు.లేటెస్ట్ గా రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కూడా భారీ షాకే తగిలింది.

Advertisement
Adam Zampa And Kane Richardson Of Rcb Team Out From Ipl 2021 Due To Corona , Ada

ఐపీఎల్ 2021లో రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా బౌలర్లు కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్ జంపా.లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తాము స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు.ఇదే విషయాన్ని బెంగళూరు కూడా ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

Adam Zampa And Kane Richardson Of Rcb Team Out From Ipl 2021 Due To Corona , Ada

వ్యక్తిగత కారణాలంటూ విదేశీ క్రీడాకారులు నెమ్మదిగా ఐపిఎల్ నుంచి వెళ్లిపోతున్నారు.ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐదు మంది ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ఇక ఆడలేమంటూ ఖరాకండీగా చెప్పేస్తున్నారు.

నిన్నటి దినం రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై జట్టును వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.ఇక హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా వెళ్లి పోయాడు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్ నుంచి ఔట్ అయ్యారు.వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ ఆడలేకపోతున్నామని చెప్పి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.

Advertisement

ఈ ఫార్మెట్ లో అడమ్ జంపా సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కేన్ రిచర్డ్‌సన్ కూడా ఈ సీజన్‌లో కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు.

ఇండియాలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం వల్లే క్రీడాకారులు వెళ్లిపోతున్నట్లు సమాచారం.

తాజా వార్తలు