ప్రేమలో నయన్‌?

తమిళ స్టార్‌ హీరోయిన్‌ నయనతార గతంలో హీరో శింబుతో ప్రేమలో పడి, ఆ తర్వాత బ్రేకప్‌ అయిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత కొంత కాలానికి ఈ అమ్మడు దర్శకుడు ప్రభుదేవ ప్రేమలో మునిగి తేలింది.

వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది.అయితే కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది.

ఆ తర్వాత నయన్‌ మరో హీరో ఆర్యతో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వచ్చాయి.అయితే ఆ వార్తలను నయన్‌ పలు సార్లు తోసిపుచ్చింది.

తాజాగా మరోసారి నయన్‌ ప్రేమ గురించి తమిళ మీడియాలో హాట్‌ హాట్‌ వార్తలు ప్రసారం అవుతున్నాయి.ఈ అమ్మడు ప్రస్తుతం ఒక యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఆ దర్శకుడినే త్వరలో ఈమె పెళ్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు.వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయని, త్వరలో వీరి వివాహ అధికారిక ప్రటన వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

నయన్‌ ప్రేమ ఈసారైనా పెళ్లి పీఠల వరకు వెళ్లేనో చూడాలి.

Advertisement

తాజా వార్తలు