హీరోతో గడపడం తప్పనిసరి.. తెరవెనుక బాగోతలు బయటపెట్టిన బోల్డ్ హీరోయిన్!

ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఇప్పటికీ ఎంతోమంది నటీమణుల నుండి వింటూనే ఉన్నాం.

మీటూ ఉద్యమం రావడంతో ఎంతోమంది ఇండస్ట్రీకి చెందిన మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాలు బయట పెడుతున్నారు.

ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం బాగా అలవాటైపోయింది.ఇక తమకు సహకరించకపోతే ఆ నటి కెరీర్ అక్కడికి ఆగిపోతుంది.

ఇక కొందరు తమ కెరీర్ కోసం లొంగిపోకుండా ఉండలేరు.దీంతో ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి దాడుల గురించి బయట పెడుతూ ఉంటారు.

ఇంకా కొందరు తమ కెరీర్ కోసం బయట పెట్టరు.తాజాగా ఈ విషయం గురించి మరో హీరోయిన్ బయట పెట్టింది.బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా శెరావత్.2004 లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మల్లికా శెరావత్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.పైగా ఆమెకు బోల్డ్ హీరోయిన్ అని పేరు కూడా వచ్చింది.

Advertisement
Bollywood Heroine Mallika Sherawat Open Comments On Casting Couch, Mallika Sher

ఎక్కువగా రొమాంటిక్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె కెరీర్ లో అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఎదగలేకపోయింది.

దానికి కారణం తనకు ఎదురైన చేదు అనుభవం అంటూ తెలిపింది.

Bollywood Heroine Mallika Sherawat Open Comments On Casting Couch, Mallika Sher

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లికా శెరావత్ కొన్ని కామెంట్స్ చేసింది.తెరవెనుక తాము అంగీకరించినట్లు ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారట.తన ప్రతిభకు తగిన అవకాశాలు ఇవ్వలేదని తెలిపింది.

తనకు ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని.కొందరు హీరోలకు తమ కోరికలు తీర్చలేనందుకు అవకాశాలు రాకుండా చేశారని తెలిపింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

తన కెరీర్ మొదట్లో మీడియా ప్రభావం ఎక్కువగా లేదని, అప్పట్లో ఓ నటి తన కెరీర్ లో సాగాలంటే హీరోతో గడపడం తప్పనిసరని తెలిపింది.

Advertisement

కావాలని బోల్డ్ సీన్లు కూడా పెట్టేవారని.కెమెరా ముందు చేసినప్పుడు నిజ జీవితంలో ఎందుకు చేయరని అడిగే వారట.ఆ విషయంలో తను దూరంగా ఉండటం వల్ల చాలా సినిమాలలో అవకాశాలు కోల్పోయానని తెలిపింది.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఇలా జరుగుతున్నాయని తెలిపింది.తనకు బోల్డ్ అని పిలవడానికి తోటి నటులు కారణం అని తెలిపింది.

తాజా వార్తలు