రూ.31.99 కోట్ల సీఎంఆర్ ధాన్యం ఎగవేతపై చర్యలు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులోని ఎంకెఆర్ మోడ్రన్ రైస్ మిల్ కు గత రబీ,ఖరీఫ్ సీజన్లకు కలిపి కేటాయించిన 15795.440 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులు ఆదేశాలతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మిల్లును తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన సుమారు రూ.31.99 కోట్ల విలువ గల 14,524,091 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగమైనట్లు గుర్తించారు.జిల్లా మేనేజర్ పి.రాములు పిర్యాదు మేరకు మిల్లు యజమాని మల్లేపల్లి కర్నాకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈట సైదులు తెలిపారు.

Latest Suryapet News