ఏజెంట్ వినోద్ అంటూ వస్తున్నా అభిషేక్ పిక్చర్స్

Agent Vinod Pre Look Poster Looking Interesting, Abhishek Pictures, Navin Medaram, Tollywood

టాలీవుడ్ లో నైజాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా అభిషేక్ పిక్చర్స్ భాగా గుర్తింపు పొందింది.ఇక ఈ సంస్థ సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తుంది.

 Agent Vinod Pre Look Poster Looking Interesting, Abhishek Pictures, Navin Medara-TeluguStop.com

ఈ క్రమంలో గూఢచారి, సాక్ష్యం, కేశవ వంటి చిత్రాలను నిర్మించచింది.ఈ సినిమాలలో మినిమం బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు ఉన్నారు.

ఈ ప్రొడక్షన్ సంస్థ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసింది. ఏజెంట్ వినోద్ టైటిల్ తో ఆ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో అలాంటి స్పై ఇన్వెస్టిగేషన్ కథలకి క్రేజ్ ఉంటుందని అర్ధమైంది.ఈ నేపధ్యంలో రవితేజ కూడా ఒక డిటెక్టివ్ స్టొరీతోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.

ఈ నేపధ్యంలో ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఏజెంట్ వినోద్ తో మరో సారి సినిమాని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.

హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన అనుభవం ఉన్న నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

హారీపోటర్, పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, 2012, బ్యాట్ మ్యాన్: ద డార్క్ నైట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా వర్క్ విభాగంలో నవీన్ మేడారం పని చేశారు.ఇతను దర్శకుడుగా మారి మొదటి సారి డిటెక్టివ్ కతఅంశంతో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఏజెంట్ వినోద్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

ఏజెంట్ మరియు డిటెక్టీవ్ సినిమాలను తలపించేలా ఈ ప్రీ లుక్ కూడా డిజైన్ చేయబడింది.ఈ పోస్టర్ లో గన్ పుస్తకాలు లాంతరు టైపింగ్ మెషీన్ పెన్ను కెమెరా గడియారం తాళాలు వంటి పాత కాలం నాటి వస్తువులతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

అంతేకాకుండా తుపాకీ పట్టుకున్న ఒక వ్యక్తి నీడ మరియు రక్తపు మరకలు కనిపిస్తుండటంతో ఇది క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.అయితే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తరహాలో లో బడ్జెట్ మూవీగా దీనిని తెరకెక్కిస్తారా, లేక ఎవరైనా పెద్ద స్టార్ తో దీనిని తెరకెక్కించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube