నాంపల్లి లో పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదిర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోతుందని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు.

వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించిన అబ్దుల్ ఖాదీర్ శాకెరున్నిసా బేగం పదవీ విరమణ కార్యక్రమం శనివారం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.

అబ్దుల్ ఖాదిర్ దంపతులను అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.పాఠశాలలో అబ్దుల్ ఖాదిర్ సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని ఉద్యోగ నిర్వహణలో ఆయన చేసిన సేవలు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయన్నారు.ఉపాధ్యాయ వృత్తి అనేది విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశం చేయడంలో కీలకంగా ఉంటుందన్నారు.

పదవీ విరమణ పొందినప్పటికీ వ్యక్తిగతంగా అబ్దుల్ ఖాదిర్ తన అనుభవాలను పాఠశాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ మల్లయ్య కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

Latest Rajanna Sircilla News