అమ్మ సూచనలతో ప్రైవేట్ జెట్ లో షిరిడీకి వెళ్లిన హీరో విజయ్.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు( Vijay ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరికొన్ని రోజుల్లో విజయ్ ది గోట్( The Goat Movie ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Hero Vijay Went To Shirdi In Private Jet Details,vijay, Hero Vijay, Vijay Thalap-TeluguStop.com

వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా విజయ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.ఈ సినిమాలో విజయ్ ను డీ ఏజింగ్ టెక్నాలజీతో చూపించనున్నారు.

అయితే విజయ్ లుక్స్ విషయంలో కొన్ని ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు విజయ్ త్వరలో పొలిటికల్ గా బిజీ కానున్నారు.రాబోయే రోజుల్లో విజయ్ పాదయాత్ర చేయడం ద్వారా వార్తల్లో నిలవనున్నారని తెలుస్తోంది.అయితే తల్లి కోరిక మేరకు విజయ్ తాజాగా షిరిడి సాయిబాబాను( Shirdi Saibaba ) దర్శించుకున్నారు.

సినిమాలలో ఒక వెలుగు వెలిగిన విజయ్ ఇకపై రాజకీయాల్లో సైతం వెలుగు వెలిగేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రైవేట్ జెట్ లో తల్లి కోరిక మేరకు విజయ్ షిరిడి వెళ్లినట్టు తెలుస్తోంది.

విజయ్ పార్టీ పేరు తమిళగ వేట్రి కళగం( Tamilaga Vetri Kalagam ) కాగా ఈ పార్టీకి సంబంధించిన జెండాను సైతం ఇప్పటికే ఆవిష్కరించడం జరిగింది.భవిష్యత్తులో విజయ్ సినిమాలకు సైతం గుడ్ బై చెప్పనున్నారు.వినాయకచవితి పండుగ కానుకగా ది గోట్ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాతో విజయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.విజయ్ తల్లి శోభ( Shobha ) సాయిబాబా భక్తురాలు అనే సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ నెల 23వ తేదీన విజయ్ తిరుచ్చిలో మానాడు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.విజయ్ రెమ్యునరేషన్ ఏకంగా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

స్టార్ హీరో విజయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube