ఆదమరిస్తే పెనుప్రమాదం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండల పరిధిలోని దిర్శించర్ల గ్రామంలో రోడ్డు పక్కనే,విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చెత్త డంప్ యార్డ్ కు నిప్పు పెట్టడం వలన రాత్రివేళల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి.

పక్కనే విద్యుత్ సబ్ స్టేషన్ ఉండటం,రోడ్డుపై నుండి వాహనాలు వెళ్తుండటంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలుష్య కుంపటిగా దిర్శించర్ల డంప్ యార్డ్ మారిందని,దీనిపై అధికారుల నియంత్రణ కరువైందని,నేరేడుచర్ల పురపాలిక వ్యర్థాలు దిర్శించర్ల గ్రామ డంపింగ్ యార్డులో వేస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు.డంపింగ్ యార్డులో రాత్రివేళలో వ్యాపిస్తున్న మంటల గురించి దిర్శించర్ల గ్రామపంచాయతీ,నేరేడుచర్ల పురపాలిక అధికారులను అడిగితే తమకేమీ తెలియదనడం గమనార్హం.

ఈ మంటల వలన హరితహారంలో నాటిన మొక్కలు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయని వాపోతున్నారు.ఒకవైపు ఇటుక బట్టీల కాలుష్యం, మరోవైపు డంపు యార్డ్ కాలుష్యంతో తాము బ్రతికేదేలా సారూ అంటూ స్థానికుల ఆవేదన చెందుతున్నారు.

స్థానికులు,వాహనదారులు నిత్యం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ప్రజాప్రతినిధులు,అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లోని మంటలను అదుపులోకి తెచ్చి,అక్కడి నుండి డంపింగ్ యార్డ్ ను ఊరికి దూరంగా తరలించాలని కోరుతున్నారు.

Advertisement
ఆరోగ్యానికి వరం బొప్పాయి.‌. కానీ ఇలా తింటే చాలా డేంజర్..!

Latest Suryapet News