బోరు బావుల్లో చెడిపోయిన ఇరుక్కుపోయిన బోర్ మోటార్ల ను పైకి తీసే ట్రాక్టర్ యంత్రం

వ్యవసాయ బోరు బావుల్లో చెడిపోయిన ఇరుక్కుపోయిన బోరు మోటార్లను పైకి తీసేందుకు ఉపయోగించే ట్రాక్టర్ యంత్రమును కొనుగోలు చేసి ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రానికి చెందిన వైండింగ్ షాప్ మెకానిక్ దూస శ్రీనివాస్ , వడ్నాల ఆంజనేయులు తెలిపారు.

బోరు బావి మోటార్లు చెడిపోయినప్పుడు మనుషుల సహాయంతో పైకి ఎత్తి లిఫ్ట్ చేయాలంటే చాలా ఎక్కువ సమయం పట్టేదని పంట పొలాలకు నీరు ఇవ్వడానికి రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుండేవని నూతన టెక్నాలజీ సహాయంతో పైకి లిఫ్ట్ చేసే ట్రాక్టర్ యంత్రాన్ని( Tractor machine ) కొనుగోలు చేసి ఎల్లారెడ్డిపేట మండల రైతులకు అందుబాటులో ఉంచారు.

ఎవరికి అవసరం ఉన్న తమను సెల్ నెంబర్ 9441020690 , 99491 21056 ద్వారా సంప్రదించవచ్చని దూస శ్రీనివాస్, వడ్నాల ఆంజనేయులు తెలిపారు.

బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ

Latest Rajanna Sircilla News