OCI Card : మారిషస్‌లోని భారత సంతతి కమ్యూనిటీకి మోడీ సర్కార్ గుడ్ న్యూస్

భారత సంతతికి చెందిన ఏడవ తరం మారిషస్ పౌరులను ‘‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ’’ ( Overseas Citizen of India )కార్డుకు అర్హత పొందేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక నిబంధనకు ఆమోదం తెలిపింది.ప్రస్తుతం మారిషస్ పర్యటనలో వున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) ఈ మేరకు ప్రకటన చేశారు.

 India Approved A Special Provision To Make 7th Gen Indian Origin Mauritians Eli-TeluguStop.com

గంగా తలావ్ అనే బిలం సరస్సును మత, సాంస్కృతిక , పర్యాటక కేంద్రంగా పునరాభివృద్ధి చేయడంలో మారిషస్‌కు భారత్ మద్ధతు ఇస్తుందని రాష్ట్రపతి తెలిపారు.గంగా తలావ్ మారుమూల పర్వత ప్రాంతంలో వుంది.

మారిషస్‌లోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా దీనిని పరిగణిస్తారు.

సోమవారం మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ( Prime Minister Pravind Kumar Jugnath )ఇచ్చిన విందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

‘‘ ఏడవ తరానికి చెందిన భారత సంతతి మారిషయన్లు ఓసీఐ కార్డుకు అర్హులయ్యే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనను ఆమోదించిందని తెలియజేసేందుకు చాలా సంతోషంగా వుంది.ఇది భారత సంతతికి చెందిన యువ మారిషయన్లు భారతదేశ విదేశీ పౌరులుగా మారడానికి , వారి పూర్వీకుల గడ్డతో తిరిగి కనెక్ట్ కావడానికి వీలు కల్పిస్తుంది .ఈ ప్రాజెక్ట్‌లో మా సహకారం మన రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని మరింత లోతుగా మారుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

Telugu India, Indiaapproved, Citizen India, Draupadi Murmu, Primepravind, Rupay-

మారిషస్‌తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇక్కడి కార్యనిర్వహక విభాగంతో భారతీయ నేతలు( Indian leaders ) తరచుగా పర్యటనలు చేస్తున్నారు.గత కొన్ని వారాల్లో ఇరు దేశాల ప్రధాన మంత్రులు భారత్, మారిషస్‌లో యూపీఐ, రూపే కార్డు ( UPI, RuPay card )సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను ప్రారంభించారు.అలాగే అలాలెగాలో ఆరు కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లతో పాటు కొత్త ఎయిర్‌స్ట్రిప్, జెట్టీని కూడా ప్రారంభించారు.

Telugu India, Indiaapproved, Citizen India, Draupadi Murmu, Primepravind, Rupay-

కాగా.కేంద్రం నిర్ణయం మారిషస్‌లో వున్న భారతీయులను పెద్ద సంఖ్యలో ఓసీఐలుగా మారేందుకు ప్రోత్సహిస్తుందని ప్రవాసులు అంచనా వేస్తున్నారు.దీని వల్ల భారతదేశానికి వెళ్లడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఓసీఐ కార్డు ద్వారా జీవిత కాలం పాటు ఎలాంటి వీసా లేకుండా భారత్‌కు రావొచ్చు.ఓసీఐ కార్డున్న వారు ఓటు హక్కు, ప్రభుత్వ సేవలు, వ్యవసాయ భూముల కొనుగోలు తప్ప మిగతా అన్ని హక్కులూ పొందేందుకు వెసులుబాటు వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube