అడవిలో వెళ్తుండగా సడన్‌గా ఎదురుపడ్డ గొరిల్లా.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో...

గొరిల్లాలు చాలా బలంగా ఉంటాయి.అవి తలుచుకుంటే మనుషులను నిమిషంలోనే చంపేయగలవు.

 A Gorilla Suddenly Encountered While Walking In The Forest Video Of Giving Goo-TeluguStop.com

కానీ ఇవి కనిపించిన వెంటనే మనుషులపై పడిపోయి చంపేసేంత క్రూరమైనవి కావు.చాలా సందర్భాల్లో ఇవి మనుషులకు ఎదురుపడ్డా చంపేయవు.

కొంచెం పరిచయం చేసుకుంటే ఈ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి.కానీ వాటిని దగ్గరనుంచి చూస్తే చాలా భయం వేస్తుంది.

ముఖ్యంగా అనుకోకుండా ఎదురుపడితే అవి భయానికి గురై దాడి చేసే ప్రమాదం కూడా ఉంది.అయితే ఇటీవల అడవిలోకి వెళ్లిన కొందరు పర్యాటకులకు ఒక గొరిల్లా( Gorilla ) అకస్మాత్తుగా ఎదురు పడింది.

దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ట్రావెల్ ఎక్స్‌పర్ట్, కంటెంట్ క్రియేటర్ అయిన కామెరాన్ స్కాట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియో తనకు, తన అతిథులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించిందని అతడు అన్నాడు.పొదల్లోంచి ఓ పెద్ద గొరిల్లా వచ్చి వారి దగ్గరికి వెళ్లిందని చెప్పాడు.

గొరిల్లా తన అందం, శక్తిని ప్రశాంతంగా చూపించిందని అతను చెప్పాడు.గొరిల్లాలను, అడవిని కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు.

కొందరు వ్యక్తులు నేలపై కూర్చొని ఉండటంతో వైరల్ వీడియోలో మనం చూడవచ్చు.వారి చుట్టూ చాలా మొక్కలు ఉన్నాయి.అప్పుడు, ఒక గొరిల్లా పొదలలో నుంచి బయటకు రావడం కనిపిస్తుంది, వారి ముందు నుంచే అది వెళ్తుంది.ఈ దృశ్యం చూసి వారు చాలా ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు.

గొరిల్లా కేవలం ఒక అడుగు దూరం నుంచి వెళ్తున్నప్పుడు వారికి చాలా భయమేసింది.వెళ్లిపోయిన తర్వాత వారు హాయిగా నవ్వుకున్నారు.

ఈ అరుదైన, అద్భుతమైన ఎన్‌కౌంటర్‌ను పొందడం తమ అదృష్టంగా భావించారు.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో బాగా పాపులర్ అయింది.

కోటి దాకా దీనికి వ్యూస్ వచ్చాయి.గొరిల్లా మనుషులను పట్టించుకోదని, అది తన దారిన దాని పోయిందని వీడియో చూసిన ఒక నెటిజన్ పేర్కొన్నాడు.

గొరిల్లా చాలా అందంగా ఉందని, అయితే అవి దగ్గర ఉంటే చాలా భయపడతానని మరో వ్యక్తి చెప్పాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube