ఆశ్చర్యపరుస్తున్న అతిపెద్ద రెయిన్ ట్రీ వీడియో.. ఇది ఎక్కడుందో తెలిస్తే..

ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చెట్లు ఉన్నాయి.అవి ఆకాశాన్ని తాకేంత ఎత్తు, ఒక పెద్ద రూమ్ అంత వెడల్పుతో చాలా మెజెస్టిక్ గా నిలుస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.ఇండియాలో( India ) కూడా ఇలాంటి చెట్లకు కొదవలేదు.

ముఖ్యంగా ఇండియాలో రెయిన్‌ట్రీస్‌( Raintree ) భారీ ఎత్తు పెరుగుతూ చాలామందిని ఆకట్టుకుంటాయి.తాజాగా భారత్‌లోని ఒక అతిపెద్ద రెయిన్‌ట్రీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇన్‌సేన్ రియాలిటీ లీక్స్ అనే ట్విట్టర్ అకౌంట్ ఈ చెట్టుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

Advertisement

చాలామంది ఈ చెట్టు అద్భుతంగా ఉందని చాలా పెద్దగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

ఇకపోతే జెయింట్ రెయిన్‌ట్రీ సమానియా సమన్( Samania Saman ) జాతికి చెందినది, ఇది బఠానీ కుటుంబమైన ఫాబేసిలో ఒక రకం చెట్టు.పుష్పించే ఈ చెట్టు మధ్య, దక్షిణ అమెరికాకు చెందినది, కానీ దక్షిణ, ఆగ్నేయాసియాకు, అలాగే హవాయితో సహా పసిఫిక్ దీవులలో కూడా కనిపిస్తుంది.చెట్టుకు సమన్, రెయిన్ ట్రీ, మంకీపాడ్, ఈస్ట్ ఇండియన్ వాల్‌నట్ వంటి అనేక పేర్లు ఉన్నాయి.

చెట్టు పెద్ద గొడుగు ఆకారపు కిరీటాన్ని కలిగి ఉంది, ఇది వర్షం నుండి నీడను, ఆశ్రయాన్ని అందిస్తుంది.చెట్టు సాధారణంగా 15-25 మీటర్ల ఎత్తు, 30 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది.

చెట్టు ఆకులు( Leaves ) ఎండా కాలంలో రాలిపోతాయి.వర్షపు వాతావరణంలో సాయంత్రం వేళల్లో ఆకులు ముడుచుకుంటాయి.కలప, ఫర్నీచర్, మేత, ఔషధం, రంగు, గమ్ వంటి వివిధ ప్రయోజనాల కోసం చెట్టును ఉపయోగిస్తారు.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
దొరికేసాడు.. దొరికేసాడు.. ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఇదిగో.. (వైరల్ వీడియో)

భారతదేశంలోని అస్సాంలో( Assam ) బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతిలో ఉన్న రెయిన్‌ట్రీ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ కలిగి ఉంది.

Advertisement

తాజా వార్తలు