Adilabad : ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

ఆదిలాబాద్ జిల్లాలోని( Adilabad District ) బోథ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

బోథ్ లోని( Boath ) ఓ పరుపుల తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

పత్తి నిల్వలు ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.ఈ మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.

మృతుడు మహ్మద్ ఉమర్( Mahammed Umar ) అనే కూలీగా గుర్తించారు.

కాగా మంటల ధాటికి దుకాణం పూర్తిగా దగ్ధమైంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు