ఆముదం ( castor oil )గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.చాలామంది జుట్టుకు ఆముదం ఉపయోగిస్తూ ఉంటారు.
జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు, కురులు ఒత్తుగా దృఢంగా పెరిగేందుకు ఆముదం అద్భుతంగా తోడ్పడుతుంది.అలాగే అందానికి కూడా ఆముదం అండగా నిలుస్తుంది.
విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ( Vitamin E, antioxidants, anti-inflammatory ), యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉండటం వల్ల ఆముదం చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.వివిధ చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
సాధారణంగా కొందరికి పెదాలు( lips ) తరచూ పొడిబారిపోతూ ఉంటాయి.పగుళ్లు ఏర్పడుతుంటాయి.అయితే ఈ సమస్యకు ఆముదంతో చెక్ పెట్టవచ్చు.రోజు నైట్ నిద్రించే ముందు పెదాలకు ఆముదాన్ని అప్లై చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్ గా చేస్తే డ్రై లిప్స్ కి గుడ్ బై చెప్పవచ్చు.
అలాగే స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేయడానికి ఆముదం తోడ్పడుతుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ), వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె( Almond oil ) వేసుకొని మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను ముఖానికి మెడకు అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.
రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు ఈ విధంగా చేస్తే వయసు పెరిగిన యవ్వనంగా కనిపిస్తారు.ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.
చర్మం మృదువుగా మారుతుంది.
ముఖంపై నల్లటి మచ్చలు పోగొట్టడానికి కూడా ఆముదం సహాయపడుతుంది.నైట్ బెదిరించే ముందు రెండు చుక్కల ఆముదం తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
ఇక కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా ఆముదంకు ఉంది.పొట్ట, పిరుదులు, తొడలు దగ్గర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.
ఆయా భాగాల్లో గోరువెచ్చని ఆముదం అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే కొవ్వు క్రమంగా కరుగుతుంది.