ఇవి రెండు ఉంటే చాలు.. చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు!

ప్రస్తుత వర్షాకాలంలో( rainy season ) పిల్లలు పెద్దలు తేడా లేకుండా దాదాపు అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో చుండ్రు ఒకటి( Dandruff ) .వర్షంలో తడిస్తే ఈ సమస్య మరీ అధికంగా ఉంటుంది.

 Say Goodbye To Dandruff With This Powerful Remedy! Powerful Remedy, Dandruff, Da-TeluguStop.com

చుండ్రు కారణంగా తలలో దురద, జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారడం, కురులు పొడిబారడం తదితర సమస్యలు తలెత్తుతాయి.ఈ క్రమంలోనే చుండ్రును పోగొట్టుకునేందుకు చాలా ఖరీదైన యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ తో మాత్రం చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా అంగుళం అల్లం ముక్క( piece of ginger ) తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకు వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మరియు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Dandruff, Ginger, Care, Care Tips, Healthy, Healthy Scalp, Latest, Neem,

అరగంట లేదా 40 నిమిషాల అనంతరం షాంపూను ఉపయోగించి గోరువెచ్చని నీటితో( warm water ) శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా కనుక చేశారంటే మంచి రిజల్ట్ పొందుతారు.వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.ఇవి చుండ్రును వదిలించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.

Telugu Dandruff, Ginger, Care, Care Tips, Healthy, Healthy Scalp, Latest, Neem,

అలాగే అల్లం లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ( Anti-inflammatory, antibacterial, antifungal )లక్షణాలు ఉంటాయి.అందువల్ల వేప అల్లం కలిపి పైన చెప్పిన విధంగా తలకు పట్టిస్తే చుండ్రు మొత్తం క్రమంగా తొలగిపోతుంది.స్కాల్ప్ ఆరోగ్యంగా శుభ్రంగా మారుతుంది.అంతేకాకుండా అల్లం తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.కురులు త్వరగా తెల్ల‌బడకుండా సైతం కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube