దగ్గు( cough ).ఒక్కసారి పట్టుకుందంటే అంత త్వరగా వదిలిపెట్టదు.
దగ్గు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.పని పై శ్రద్ధ పెట్టలేకపోతుంటారు.
దగ్గు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది.ఈ క్రమంలోనే దగ్గు సమస్యను వదిలించుకునేందుకు రకరకాల మందులు, టానిక్స్ వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ హెర్బల్ టీ ను రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఎంతటి దగ్గు అయినా సరే పరార్ అవుతుంది.మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అర అంగుళం అల్లం ముక్క ( ginger )తీసుకొని పొట్టు తొలగించి శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అల్లం తురుము వేసుకోవాలి.అలాగే నాలుగు లవంగాలు( cloves ) మరియు అంగుళం దాల్చిన చెక్క( 1 ) వేసి మరిగించాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగిస్తే మన హెర్బల్ టీ అనేది రెడీ అవుతుంది.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో టీను ఫిల్టర్ చేసుకుని తేనె కలిపి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజుకు రెండుసార్లు ఈ హెర్బల్ టీ ను కనుక తీసుకుంటే గొంతులో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.ఊపిరితిత్తులు పేరుకుపోయిన కఫం కరుగుతుంది.దగ్గు సమస్య చాలా వేగంగా తగ్గుముఖం పడుతుంది.అలాగే జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు ఉన్న కూడా పరారవుతాయి.కాబట్టి దగ్గుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెర్బల్ టీ ను డైట్ లో చేర్చుకోండి.
పైగా ఈ హెర్బల్ టీ వెయిట్ లాస్ కు మద్దతు ఇస్తుంది.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలను సైతం దూరం చేస్తుంది.