కొడుకుతో సహా వద్దు అనుకుంటే దేనినైనా వదులుకోగల అసమాన్యుడు రామోజీరావు 

అతడు అసమాన్యుడు అని చెప్తే అది చిన్న పదమవుతుంది.జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యంతో నిండిన వార్తను నేలపైకి దింపిన మకుటం లేని మహారాజు రామోజీరావు.

 Ramoji Rao Nature For Business Details, Ramoji Rao, Ramoji Rao Son, Ramoji Rao D-TeluguStop.com

( Ramoji Rao ) మనిషి కష్టాలను కడగండ్లను అక్షర రూపం దాల్చి ప్రతి సామాన్యుడు ఇంటికి చేరవేసిన ఘనత కూడా ఆయనదే.అక్షరానికి రూపం దాలిస్తే ఆ మహా రూపమే అతడు.

అయితే అనుభవమే అన్ని పాఠాలను ప్రతి ఒక్కరికి అందిస్తుంది.దానికి ఎవరు అతీతులు కారు.

ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దేని పైన మక్కువ ఉండదు.అందుకు రామోజీరావు కూడా అతీతుడు కాదు తాను వద్దు అనుకుంటే ఎంతటి దానినైనా సరే తీసి పక్కన పెట్టగలడు.

అది కొడుకైన, వ్యాపారమైన, మరొకటి ఏదైనా.

Telugu Ramoji Rao, Ramojirao, Ramoji Rao Son, Tollywood-Movie

రామోజీరావు కి చిన్న కుమారుడికి కొన్ని విభేదాలు వచ్చాయి ఈటీవీ( ETV ) సంస్థలోనే ఇవన్నీ కూడా ఆ పురుడు పూసుకున్నాయి.సమస్యకు ఇరువైపులా జనాలు చేరి దానిని మరింత జటిలం చేశారు.అయినా కొడుకునైనా వదులుకుంటాను కానీ మాట మాత్రం వదిలేసే పరిస్థితి లేదు అన్నారు.

తన పట్టింపు ప్రతాపం ఆరెంజ్ లో ఉంటుంది మరి.అలా చిన్న కొడుకును చివరికంటా దూరంగానే ఉంచాడు.వ్యాపారంలో( Business ) కూడా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని కొన్నింటిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేసాడు.

Telugu Ramoji Rao, Ramojirao, Ramoji Rao Son, Tollywood-Movie

ఫర్టిలైజర్స్, సోమ డ్రింక్స్, న్యూస్ టైం వంటి వాటిని సైతం చీమంత బాధ కూడా లేకుండా వదిలేశాడు.ఉపయోగం లేని వీటిని భరించాల్సిన అవసరం లేదు అని నమ్మాడు రామోజీరావు.అపజయం ఎదురవుతుంది అంటే దాని నుంచి పక్కకు తప్పుకోవాల్సిన సమయం వస్తుంది ఆ రోజు తప్పకుండా తప్పుకోవాలి అందుకే వ్యాపారాలను వదిలేశాడు కన్న కొడుకుని దూరం పెట్టాడు అయినా కూడా ఎక్కడ ఒక అడుగు వెనక్కి వేయకుండా ప్రపంచానికి తన జయాన్ని మాత్రమే చూపించాడు.

రామోజీరావు నేర్చుకున్న పాటలు ఏ ఐ ఐ టి సంస్థలోనూ దొరకవు.మహా ప్రాక్టికల్ మనిషి అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన గురించే మాట్లాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube