ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Aravind Kejriwal ) అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తీర్పును రిజర్వ్ చేసింది.సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
అరెస్ట్ వ్యవహారంపై రౌస్ అవెన్యూ కోర్టులో సుమారు మూడు గంటలుగా వాదనలు కొనసాగాయి.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi Liquor Scam ) కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ పేర్కొంది.
ఈ క్రమంలోనే ఆయనను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది.మరోవైపు ఈడీ రిమాండ్ ను కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు.ఈ నేపథ్యంలో సుదీర్ధ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.