హిందూ ధర్మంలో అమలిక ఏకాదశికి( Amalika Ekadasi ) ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.హిందూ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున అమలిక ఏకాదశిని జరుపుకుంటారు.
ఒక ఏడాదిలో దాదాపు 24 నుంచి 26 ఏకాదశిలు ఉన్నాయి.ప్రతి ఏకాదశి దాని సొంత ప్రత్యేకత కలిగి ఉంటుంది.
శ్రీమహావిష్ణువు( Sri Mahavishnu ) చర్యలను బట్టి శయన ఏకాదశి, పరివర్తన ఏకా దశి, ప్రబోధినేకాదశి, ప్రవత నియమాలను బట్టి నిర్జల ఏకాదశి, ఫల ఏకాదశి ఏర్పడ్డాయి.అయితే ఒక పండు నామంతో ఏర్పడినది మాత్రం అమలిక ఏకాదశి మాత్రమే అని పండితులు చెబుతున్నారు.
ఈ అమలిక ఏకాదశినే సాధారణ భాషలో ఉసిరి ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ ఏకాదశి మార్చి 20వ తేదీన బుధవారం అర్ధరాత్రి 12 గంటల 21 నిమిషములకు ప్రారంభమై, మార్చి 21వ తేదీన తెల్లవారుజామున రెండు గంటల 21 నిమిషములకు ముగిసిపోతుంది.అమలకి ఏకాదశి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం చిత్ర సేనుడు( Chitrasenudu ) అనే రాజు ఉండేవాడు.అతను రాజ్యంలో ఏకాదశి ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవాడు.ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండేవారు.
ఒక రోజు రాజు ఏకాదశి రోజు అడవిలో వేటకు వెళ్ళాడు.అక్కడ కొందరు బందిపోట్లు రాజును చుట్టూ ముడతారు.
ఆయుధాలతో రాజు పై దాడి చేస్తారు.కానీ దైవ అనుగ్రహం వల్ల ఆయుధాలు పుల్లలు గా మారిపోతాయి.
ఇంకా చెప్పాలంటే బందిపోట్ల సంఖ్య ఎక్కువ కావడం వల్ల రాజు ఉపవాసం ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు.అప్పుడు రాజు నుంచి ఒక దివ్య శక్తి ఆవిర్భవించి రాక్షసులందరినీ సంహరించి కనిపించకుండా వెళ్ళిపోతుంది.రాజు స్పృహలోకి వచ్చిన తర్వాత రాక్షసులు అందరూ చనిపోయి కనిపిస్తారు.వాళ్ళని చూసి దొంగలని ఎవరు చంపారు అని ఆశ్చర్యపోతాడు.అప్పుడు ఆకాశము నుంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఓ రాజా మీరు అమలిక ఏకాదశి రోజు ఉపవాసం( Fasting ) ఉండడంతో దైవానుగ్రహంతో రాక్షసులందరూ హతమయ్యారని వినిపిస్తుంది.మీ శరీరం నుంచి వైష్ణవ శక్తి ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి మళ్లీ మీ శరీరంలోకి ప్రవేశించింది అని చెబుతోంది.
రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు అందరికీ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలిపాడు.
DEVOTIONAL