ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇల్లు కట్టడం దగ్గర నుంచి అలంకరణ వస్తువులు పెట్టుకునే వరకు ప్రతి విషయంలోనూ వాస్తు నియమాలను పాటిస్తారు.
అలాగే ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలో( Plants ) కూడా చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రం శాస్త్రాన్ని అనుసరిస్తారు.అదృష్టం సంపద పెరగాలని కోరుకుంటూ కొంతమంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు.
ఆర్థిక పరిస్థితిని మార్చే మొక్కలు అనగానే మనీ ప్లాంట్, లక్కీ వెదురు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు.ఇవే మాత్రమే కాకుండా నెమలి మొక్క( Morpankhi Plant ) కూడా ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది.
అలాగే భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించడంలో ఎంతో ప్రభావంతంగా పని చేస్తుంది.మీ ఇంట్లో ఈ నెమలి మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత సమాజంలో ఎక్కువగా నెమలి మొక్క ప్రాచుర్యం పొందింది.ఎక్కడ చూసినా గుబురుగా కనిపిస్తూ అందంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి.అటువంటి ఈ నెమలి మొక్కలు ఇంట్లో పెంచేకుంటే సానుకూల శక్తి( Positive Energy ) వ్యాపిస్తుంది.ఈ మొక్కను పెంచుకుంటే కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సంక్షోభం( Financial Problems ) దూరమవుతుంది.అలాగే ఇంటికి సంపదలు తీసుకొస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.వాస్తు ప్రకారం ఈ మొక్క మీ ఇంట్లో ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి.అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు.అటువంటి ఇంట్లో వాస్తు ప్రకారం నెమలి మొక్క నాటడం వల్ల సమస్యలు దూరమైపోతాయి.
దీని వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.ఈ భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి.
దంపత్య జీవితం మధురంగా ఉంటుంది.అలాగే ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
వీటిని ఇంట్లో జంటగా నాటడం వల్ల కుటుంబ సభ్యుల తెలివితేటలు పెరుగుతాయి.
LATEST NEWS - TELUGU