అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని( Texas ) కార్చిచ్చు వణికిస్తోంది.పాన్‌హ్యాండిల్( Panhandle ) వద్ద అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.
‘‘ ది స్మోక్ హౌస్ క్రీక్ ’’( The Smokehouse Creek Fire ) కారణంగా ఇప్పటి వరకు 10 లక్షల ఎకరాల్లో వున్న చెట్లు, పంట పొలాలు, నివాస గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి.ఇద్దరు వ్యక్తులు కార్చిచ్చు కారణంగా మృతి చెందగా.
వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి.ఈ రాష్ట్రంలోని మొత్తం పశుసంపదలో 85 శాతం పాన్‌హ్యాండిల్‌లోనే కేంద్రీకృతమై వుంది.
గురువారం సాయంత్రం ఈ కార్చిచ్చు పక్కనే వున్న ఓక్లహోమా రాష్ట్రానికి విస్తరించి అక్కడ మరో 31,500 ఎకరాలను కాల్చేసింది.అగ్నికీలల వ్యాప్తి ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది.
దీంతో టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర పరిస్ధితిని విధించాయి.
టెక్సాస్ చరిత్రలో ఇది రెండవ అతి పెద్ద అగ్నిప్రమాదం. బుధవారం 3,00,000 ఎకరాలను భస్మిపటలం చేసిన కార్చిచ్చు.మరింత బలాన్ని పుంజుకుంది.
ఈ ప్రాంతంలో భరించలేని వేడి నెలకొంది.మీడియా నివేదికల ప్రకారం దాదాపు 126 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
కార్చిచ్చుకు( Wildfire ) స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు.అయితే చల్లటి , తక్కువ గాలులతో కూడిన వాతావరణం కారణంగా సహాయక సిబ్బంది వేగంగా చర్యలు చేపట్టారు.
ఫాక్స్ ఫోర్‌కాస్ట్ సెంటర్ ప్రకారం .న్యూ మెక్సికో నుంచి వచ్చే బలమైన తుఫాను కారణంగా కొంత మంచు కురిసే అవకాశం వుందని వాతావరణం తేలికగా వుంటుందని తెలిపింది.
శుక్రవారం వాతారణం మరోసారి అధ్వాన్నంగా మారుతోంది.ఉష్ణోగ్రతలు 70 ఫారెన్‌హీట్ లేదా 22 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి.30 ఎంపీహెచ్ కంటే ఎక్కువ గాలులు వీస్తాయని, 20 శాతం కంటే తక్కువ పొడిగాలి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.ఈ పరిస్ధితులు వారాంతంలోనూ కొనసాగుతాయని భావిస్తున్నారు.
కాగా.మంగళవారం టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ .( Texas Governor Greg Abbott ) కార్చిచ్చు కారణంగా ప్రభావితమైన కౌంటీలకు విపత్తుగా ప్రకటించారు.స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయడానికి మరిన్ని రాష్ట్ర వనరులను అందించాలని గవర్నర్ కోరారు.