సాధారణంగా కోరిన కోరికలు తీరాలంటే దేవుడికి ముడుపు( Dedication to God ) కడతారు.లేదా మేకనో, గొర్రెనో, కోడినో, మొక్కుకొని మొక్కు తీర్చుకుంటారు.
కానీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్ర గ్రామంలో మాత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అరటి గెలలు కడతారు.అయితే ఉద్యోగం రావాలన్న, పెళ్లి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యలు తీరాలన్న ఇలా కోరుకున్న కోరిక ఏదైనా సరే అరటి గెలను( Banana win ) కడితే చాలు.
ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.కొందరు ముందుగా అరటి గెలను సమర్పించి కోరికను కోరుకుంటే మరికొందరు ముందుగా కోరికను కోరుకొని అది నెరవేరాకా దేవుడికి అరటి గెలను సమర్పిస్తారు.
అయితే ప్రతిఏటా మాఘ శుద్ధ భీష్మ ఏకాదశి ( Magha Suddha Bhishma Ekadashi )పర్వదినాన ఈ పండుగ ప్రారంభమై మూడు రోజులపాటు కొనసాగుతుంది.ఈ గ్రామంలో ఈ ఆచారం 80 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది.భీష్మ ఏకాదశి పర్వదినాన వేలాది అరటి గెలలను ఆలయంలో కట్టి స్థానికులు భక్తిని చాటుకుంటారు.అందుకే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ జాతర అరటి గెల పండుగ అని అంటారు.
అయితే అరటి గెలలు సమర్పించడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే సుమారు 150 ఏళ్ల కిందట పరావస్తు అయ్యవారు స్వామీజీ, చెట్ల తాండ్ర గ్రామానికి చేరుకున్నారు.అందరితో కలివీడుగా ఉంటూ అక్కడే ఒక ఆశ్రమాన్ని స్థాపించి, లక్ష్మీనరసింహస్వామిని ( Lakshminarasimhaswami )పూజిస్తూ ఉండేవారు.
ఆ తర్వాత అక్కడే పరావస్తు సజీవ సమాధి అయ్యారు.ఇక కొన్నేళ్లయ్యాక సమాధి అయిన ప్రాంతంలో ఒక రావి చెట్టు పుట్టి క్రమేపి మహావృక్షంగా పెరిగింది.అయితే స్వామీజీ సమాధి కావడానికి ముందు కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకునే వారట.కాబట్టి స్వామీజీ వద్దకు వచ్చే భక్తులు ఆయన కోసం అరటిపండ్లు తీసుకువచ్చేవారు.
అదే సాంప్రదాయం ప్రకారం అరటి గెలల పండుగకు దారితీసిందని స్థల పురాణం చెబుతోంది.అలా ఆలయంలో కోరికలను కోరుకుని అరటి గెల సమర్పించి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద అరటి గెలలను భక్తులు కడతారు.
DEVOTIONAL