ఈ ట్రంప్ అర్థంకాడబ్బా.. మాజీ అధ్యక్షుడైయుండి, బాక్సింగ్ షోకి వ్యాఖ్యాతగా

అమెరికన్ రాజకీయ వేత్తలలో డొనాల్డ్ ట్రంప్ మనస్తత్వం ప్రత్యేకమైనది.భోళాశంకరుడిగా పేరొందిన ఆయన.

 Former Us President Donald Trump To Serve As Boxing Commentator , Trump, America-TeluguStop.com

పొగడ్తలకు పొంగిపోవడం, అంతలోనే ఆగ్రహం, ముక్కుసూటి తనం, దూకుడైన స్వభావంతో అమెరికా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు.ఆయన ఎవరికి ఓ పట్టాన అర్థంకారని ట్రంప్‌తో పనిచేసిన అధికారులు, సిబ్బంది తరచుగా చెప్పే మాట.

ఇక అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు.బైడెన్ మోసం చేసి గెలిచాడని.

నిజమైన విజయం తనదేనని కోర్టులను ఆశ్రయించి మొట్టికాయలు తిన్నారు.ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 (బుధవారం)న యూఎస్ కాంగ్రెస్.

క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.

భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో ట్రంప్ వ్యవహారశైలిపై అమెరికన్లు భగ్గుమన్నారు.చట్టసభ సభ్యులైతే జనవరి 20కి ముందే ఆయనను పదవిలోంచి దించాలని, అలాగే మళ్లీ అమెరికా అధ్యక్ష రేసులో పాల్గొనకుండా చేయాలని తీర్మానం తీసుకొచ్చారు.

ఇదే సమయంలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.

అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌కే పరిమితమైన ట్రంప్ అడపాదడపా మీడియా ముందుకు వస్తున్నారు.

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి బైడెన్‌పై విరుచుకుపడ్డారు.చరిత్రలో ఇలాంటి బలగాల ఉపసంహరణ తాను చూడలేదంటూ మండిపడ్డారు.

తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.ఈ శనివారం 58 ఏళ్ల మాజీ హెవీవెయిట్‌ ఛాపియన్‌ ఎవాండర్‌ హోలీఫీల్డ్‌ తలపడుతున్న బాక్సింగ్‌ పోటీలకు ట్రంప్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

తొలి నుంచి ట్రంప్‌కు బాక్సింగ్‌తో అనుబంధం ఎక్కువే! కొన్నేళ్లు ఆయన బాక్సింగ్‌ పోటీలకు ఆతిథ్యమిచ్చాడు.వివిధ బౌట్లను సైతం ప్రమోట్‌ చేశాడు.ఇందులో చాలావరకు అట్లాంటిక్‌ సిటీలోని తన సొంత క్యాసినోలోనే జరిగాయి.

Telugu Afghanistan, America, Florida, Joe Biden, Trump, Congress-Telugu NRI

ఇక ఈ శనివారం ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లో తనయుడు డొనాల్డ్‌ జూనియర్‌తో కలిసి ట్రంప్‌ ఈ బాక్సింగ్‌ పోటీలకు వ్యాఖ్యానం చేయనున్నాడు.నాలుగు బౌట్ల ఈ పోటీని fite.tvకి పే పర్‌ వ్యూ విధానం ద్వారా వీక్షించొచ్చు.మొబైల్‌, స్మార్ట్‌టీవీ యాప్స్‌లోనూ చూడొచ్చు.ఇందుకు 49.9 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.ఇద్దరు ఫైటర్ల పోరాటాన్ని వీక్షించేందుకు, నా అభిప్రాయాలను పంచుకొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.

దీనిని మీరెవ్వరూ మిస్సవ్వొద్దు అని దేశప్రజలను ఉద్దేశించి ట్రంప్‌ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube