డౌటే లేదు అఖిల్ బ్యాచిలర్ లో హైలెట్ గా పూజా హెగ్డే..!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.

 Pooja Hegde Highlight For Akhil Bachelor Movie, Pooja Hegde, Akhil, Most Eligibl-TeluguStop.com

గోపీసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా అక్టోబర్ 8న రిలీజ్ ఫిక్స్ చేశారు.సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా సినిమా నుండి లెహెరాయి సాంగ్ ప్రోమో రిలీజైంది.

ఈ సాంగ్ చూశాక సినిమాపై ఉన్న క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పాలి.అఖిల్ బ్యాచిలర్ మూవీలో పూజా హెగ్దే హైలెట్ అవుతుందని ఈ పాట ద్వారా తెలుస్తుంది.

సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.ముఖ్యంగా ఈ సాంగ్ విషయంలో అఖిల్, పూజా హెగ్దెల రొమాన్స్ హైలెట్ గా నిలిచేలా ఉంది.ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకెళ్తున్న పూజా హెగ్దే ఈ సినిమాతో కూడా తన లక్ సినిమా రిజల్ట్ మీద కొనసాగించేలా ఉంది.ఇంకా కెరియర్ లో హిట్ ఖాతా తెరవని అఖిల్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

అఖిల్ బ్యాచిలర్ అనుకున్న రేంజ్ లో హిట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube