కేన్‌ విలియమ్సన్‌ అలాంటి నిర్ణయం తీసుకుంటాడని మీరు ఎపుడైనా ఊహించారా?

క్రికెట్ క్రీడాభిమానులకు కేన్‌ విలియమ్సన్‌ పేరుని పరిచయం చేయాల్సిన పనిలేదు.న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకొని అభిమానులకు తేరుకోలేని షాక్ ఇచ్చాడు.

 Did You Ever Imagine That Kane Williamson Would Take Such A Decision , Kane Will-TeluguStop.com

అవును, ఆ దేశానికి అన్నిఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విలియమ్సన్‌ టెస్ట్‌ క్రికెట్‌లో కివీస్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం పలువురిని కలచి వేస్తోంది.అయితే జట్టులో మాత్రం కొనసాగుతాడట.

ఈ నేపథ్యంలోనే ఇకపై వన్డే, T20 జట్లకు సారథిగా కొనసాగుతానని సుస్పష్టం చేశాడు.

ఇకపోతే వచ్చే సంవత్సరం పరిమిత ఓవర్ల ప్రపంచకప్‌ (2024 T20) ఉండటంతో వాటిపై దృష్టి సారించేందుకే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం కొసమెరుపు.2016లో బ్రెండన్ మెకల్లమ్ తరువాత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా విలియమ్సన్ బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే.ఇక ఆయన నాయకత్వంలో కివీస్‌ జట్టు 38 మ్యాచ్‌లు ఆడగా.22 టెస్టుల్లో జట్టు విజయం సాధించడం విశేషం అని చెప్పుకోవాలి.ఇందులో 8 డ్రా కాగా, 10 మ్యాచుల్లో మాత్రమే అతను సారధ్యం వహించిన టీమ్‌ ఓడిపోయింది.

అందుకే న్యూజిలాండ్ క్రికెట్‌ ప్రపంచంలో విలియమ్సన్ అనేపేరు చిరస్థాయిగా నిలిచే ఉంటుంది.ఇక ఇతగాడు అన్ని ఫార్మాట్లలో 333 మ్యాచ్‌లు ఆడగా 193 సార్లు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా చేసాడు.అయితే విలియమ్సన్ ఈ అనూహ్య నిర్ణయంతో జట్టు 31వ టెస్ట్‌ కెప్టెన్‌గా టిమ్ సౌథీని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ టామ్‌ లాథమ్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం అందరికీ తెలిసిందే.

ఇక సౌథీ నేతృత్వంలో ఈ నెల 26 నుంచి పాకిస్థాన్‌తో న్యూజిలాండ్‌ తొలి టెస్ట్ ఆడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube