వివిధ సంస్కృతులు మతాల ప్రకారం అన్ని రంగులు వేరు వేరు అర్థాలని కలిగి ఉంటాయి.అయితే దేవతలకు ఇష్టమైన రంగులు కూడా ఉంటాయి.
ఆ రంగు వస్త్రాలు సమర్పించడం లేదా పూలు పూజకి ఉపయోగించడం వలన దేవతలు సంతోషిస్తారని నమ్ముతారు.అయితే సరస్వతి దేవికి తెలుపు, హనుమంతుడికి సింధూరం, సూర్య భగవానుడికి ఎరుపు ఇలా ఒక్కొక్కరికి ఒక్క రంగు ఇష్టంగా చెబుతారు.
అయితే పవిత్రమైన కార్యక్రమాలు శుభకార్యాల సమయంలో ఎక్కువగా పసుపు, ఎరుపు రంగు వస్త్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.కానీ నలుపు( Black Color ) మాత్రం పక్కన పెట్టేస్తారు.
ఇది అశుభ సూచకానికి సంకేతంగా పరిగణిస్తారు.కానీ నిజానికి నలుపు రంగు చాలా మందికి ఫేవరెట్ కలర్ గా ఉంటుంది.
ఇక మన చుట్టుపక్కల ఎంతో మంది నలుపు రంగు వస్తువులు వినియోగిస్తారు.వాటిలో చేతికి నలుపు రంగు వాచ్ కూడా ధరిస్తారు.మరి కొంతమంది బ్లాక్ కలర్ ఫోన్ ఉపయోగిస్తారు.ఇలా ఎన్నో సందర్భాల్లో నలుపు రంగును వినియోగిస్తూ ఉంటారు.ఈ ఫ్యాషన్ ప్రపంచంలో బ్లాక్ కలర్ డ్రెస్,( Black Color Dress ) వాచ్, బూట్లు ఎక్కువగా ధరించేందుకు ఇష్టపడతారు.కానీ శుభకార్యాల విషయానికి వస్తే మాత్రం నలుపు శుభప్రదంగా పరిగణించరు.
జ్యోతిష్య శాస్త్రం( Jyotishya Shastram ) ప్రకారం నలుపు రంగు వాచ్ కొంతమంది పెట్టకూడదని చెబుతారు.ఇది వారి పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులకు కారణంగా మారుతుంది.
హిందూమతంలో వివాహమైన తర్వాత ఒక ఏడాది పాటు కొత్త దంపతులు( New Couples ) నలుపు రంగు వస్తువులు ఉపయోగించకూడదని చెబుతారు.
అలాగే బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ధరించడం వల్ల కూడా చెడు శకునం ఆహ్వానిస్తుందని చెబుతారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్( Black Belt Watch ) ఎప్పుడు చెడు శకునాన్ని సూచించదు.నలుపు రంగు శనీశ్వరుడితో ముడిపడి ఉంటుంది.
శనీశ్వరుడు ఆశీస్సులు అంటే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు.కాబట్టి రాజకీయ ప్రముఖులు ఎక్కువగా బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ధరిస్తూ ఉంటారు.
వాళ్లకి ఆశీస్సులు చాలా ముఖ్యమైనవి.జాతకంలో శని( Shani ) స్థానం మంచిగా, బలంగా ఉంటే జ్యోతిష్యులు సైతం నలుపు రంగు ధరించమని సూచిస్తారు.
కాబట్టి నలుపు రంగు కూడా ఆ శుభమైనది ఏమీ కాదు.కానీ ప్రత్యేకంగా సోమవారం నాడు నలుపు రంగు ధరించకుండా ఉంటారు.
ఎందుకంటే సోమవారం శివుడికి అంకితం చేయబడి ఉంటుంది.
DEVOTIONAL