ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదవ తేదీన వసంత పంచమి జరుపుకుంటారు.ఈ సంవత్సరం వసంత పంచమి నేడు హిందువులందరకు కూడా ఘనంగా జరుపుకుంటారు.
సరస్వతి దేవిని( Saraswati Devi ) విశేషంగా పూజించి ప్రత్యేకంగా నైవేద్యాలను కూడా సమర్పిస్తారు.అంతేకాకుండా పిల్లలకు విద్యాబుద్ధులు రావాలని, వారు ఉన్నత స్థాయిలకు ఎదగాలని కూడా కోరుకుంటారు.
ఇక చాలామంది వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని కూడా నిర్వహిస్తారు.ఇక ఈ సంవత్సరం వసంత పంచమి చాలా విశేషమైన వసంత పంచమిగా చెప్పుకోవచ్చు.
ఈ సంవత్సరం వసంత పంచమినాడు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి.వసంత పంచమినాడు అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రం( Revathi Nakshatram ) కలిసి వస్తుంది.
కాబట్టి శుక్రుడు, కుజుడు, బుధుడు కలయిక వలన రవి యోగం, త్రిగ్రహీ యోగం ఏర్పడుతుంది.ఈ యోగాల వలన కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది.ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి( Aries ):

ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.మేషరాశి జాతకులకు ఆస్తి కూడా కలిసి వస్తుంది.అలాగే భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి.
మిధున రాశి( Gemini ):

వసంత పంచమినాడు ఏర్పడే త్రిగ్రహి యోగం, గజకేసరి యోగం వలన మిధున రాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి.అలాగే జీవితంలో ఎదుర్కొంటున్న అనేక కష్టాలనుండి ఈ రాశి వారికి ఉపశమనం కూడా లభిస్తుంది.అంతేకాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.
పదోన్నతికి కూడా అవకాశం ఉంటుంది.అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి కూడా వసంత పంచమి నాడు ఏర్పడే గజకేసరి యోగం వలన లబ్ధి జరుగుతుంది.అంతా శుభప్రదంగా ఉంటుంది.బంధుమిత్రుల నుండి సహాయ,సాకారాలు అందుకుంటారు.