తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్( Telangana Assembly Media point ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను మార్షల్స్ అడ్డుకున్నారు.
సభ జరుగుతుండగా మాట్లాడొద్దని మార్షల్స్ సూచించారు.కాగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కంచెలు తొలగిస్తామని అసెంబ్లీలో కంచెలు ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS MLAs ) ప్రశ్నించారు.అసెంబ్లీలో గొంతు నొక్కుడే.బయట గొంతు నొక్కుడేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు( BRS MLA Harish Rao ) విమర్శించారు.
గతంలో ఈ స్థాయిలో పోలీసుల భద్రత లేదన్న ఆయన ఎన్నో కంచెలు అసెంబ్లీలోకి కొత్తగా వచ్చాయని తెలిపారు.